YSRCP leaders attack forest beat officer: నెల్లూరు జిల్లా చేజర్ల మండలం ఆదురుపల్లి అటవీ శాఖ చెక్‌పోస్టు వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బందిపై వైఎస్సార్సీపీ నాయకులు దాడి చేశారు. రాత్రి అక్రమ కలప తరలింపునకు వైఎస్సార్సీపీ నేతలు ప్రయత్నం చేశారు. వాహనాల్లో వచ్చి సహకరించాలంటూ అధికారులను బెదిరింపులకు గురిచేశారు. కలప తరలింపునకు సిబ్బంది అంగీకరించకపోవడంతో, బీట్ ఆఫీసర్ రాజేశ్వరితో పాటు మరో ఇద్దరు సిబ్బందిపై విచక్షణా రహితంగా దాడి చేశారు.
బీట్ ఆఫీసర్ రాజేశ్వరి తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లా చేజర్ల మండలం ఆదూరుపల్లి అటవీశాఖ చెక్ పోస్ట్ సిబ్బందిపై శనివారం ఉదయం అధికార పార్టీకి చెందిన ముగ్గురు వ్యక్తులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. తనతో పాటుగా తన సిబ్బందిపై ముగ్గురు వ్యక్తులు దాడి చేశారు. గత సంవత్సరంన్నర కాలంగా చేజర్ల మండలం నాగుల వెల్లటూరుకు చెందిన పులివర్తి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఫోన్ చేసి తనను వేధిస్తున్నాడని ఆమె ఆరోపించారు. అతని బారి నుంచి తనను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. తనపై దాడి జరుగుతున్న సమయంలో అడ్డు వచ్చిన తన కుమారుడిని సైతం కొట్టారని పేర్కొన్నారు.
పేదింటి అబ్బాయితో ప్రేమ వివాహం- కత్తితో దాడి చేసి కుమర్తెను తీసుకెళ్ళిన వైసీపీ నేత
తాను వెంకటేశ్వర్లు చెప్పిట్లు వినడం లేదని, పైఅధికారులకు తనపై అవమానకరంగా కంప్లైంట్ ఇచ్చారని రాజేశ్వరి తెలిపారు. తరచూ బ్లాక్ మెయిల్ చేస్తుంటారని చెప్పారు .తనపై అధికారులకు లేనిపోనివి చెప్పడమే కాకుండా తన తోటి సిబ్బందిని కూడా ఇబ్బంది పెడుతున్నారని వెల్లడించారు. అతని ఫోన్ నంబర్‌ను బ్లాక్ లో పెట్టినా, కొత్త నెంబర్లతో ఫోన్ చేస్తూ వేధిస్తున్నాడని రాజేశ్వరి వెల్లడించారు. ఆయన చెప్పినట్టు వినకపోతే పరువు తీసేస్తానని మానసిక వేదనకు గురి చేస్తున్నాడన్నారు. ఈ విషయాన్ని పై అధికారులు కూడా తెలిపానన్నారు. తనను, తన బిడ్డలను మానసిక వేదనకు గురి చేస్తున్నాడని రాజేశ్వరి తెలిపారు. ఈ విషయాన్ని తన డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులకు తెలియజేశానని, వారు పై అధికారులు తనకు ఎంతో సపోర్ట్ చేశారని చెప్పారు. వెంకటేశ్వర్లు నాయుడు అధికార వైఎస్సార్సీపీ అండదండలతో ఇబంబదులకు గురుచేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. అతనికి మద్దతుగా వైఎస్సార్సీపీ ఎంపీపీ తిరుపతి నాయుడు, పులిపర్తి వెంకటేశ్వర్లు, వైఎస్సార్సీపీ రాష్ట్ర బీసీ నాయకుడు మురళీ కృష్ణ యాదవ్ తనపై దాడి చేశారని బీట్ ఆఫీసర్ రాజేశ్వరి కన్నీరు మున్నీరయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు.