YS Sharmila vs bharathi reddy: వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల రోడ్ షోలో పాల్గొన్న ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు. ఈ కార్యక్రమంలో షర్మిలతో పాటుగా సునీత, వివేకా సతీమణి సౌభాగ్యమ్మ సైతం పాల్గొన్నారు. న్యాయం కోసం జగన్ చెల్లెళ్లు ఒక వైపు - భారతి బంధువులు ఒక వైపు నిలబడ్డారని షర్మిల పేర్కొన్నారు. చెల్లి కన్నా భార్య తరఫు బంధువులు జగన్‌కు ఎక్కువయ్యారా? అని ప్రశ్నించారు. అవినాష్‌రెడ్డి చిన్నపిల్లాడని జగన్ కాపాడుతున్నారట, అవినాష్‌ను అంతలా కాపాడడానికి కారణం ఎంటో చెప్పాలన్నారు. వివేకా కంటే జగన్‌కు అవినాష్‌రెడ్డి ఎక్కువయ్యారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం జగన్ ఒక కజిన్‌కి ఇంకో కజిన్‌కి మధ్య జరుగుతున్న పోరాటం అంటున్నాడు, కానీ, ఇది సొంత చిన్నాన్న గురించి జరుగుతున్న పోరని షర్మిల తెలిపారు.
న్యాయం కోసం జరుగుతున్న పోరాటమన్నారు. తండ్రి తర్వాత, తండ్రి అంతటి వాడు వివేకా, అలాంటి చిన్నాన్నను చంపిస్తే పట్టించుకోవడం లేదని, నిందితుడిని జగన్ కాపాడుతున్నాడని షర్మిల దుయ్యబట్టారు. మళ్లీ అదే అవినాష్‌రెడ్డికి టికెట్ ఇచ్చారన్న ఆమె, అంతకన్నా మగాడు ఇక్కడ లేడా? అని ప్రశ్నించారు. జగన్ సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు ఎన్నో ఉన్నాయని, అవినాష్ నిర్దోషి అని జగన్ నమ్ముతున్నాడట.. జగన్ కన్విన్స్ అయితే ప్రపంచం మొత్తం కన్విన్స్ అవ్వాలా? అంటూ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్విన్స్ అవ్వాల్సింది జగన్ కాదు, ప్రజలని తెలిపారు.
జగన్ మీ బిడ్డ కాదు- రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ గడ్డ: చంద్రబాబు - CHANDRABABU fire on JAGAN
పులివెందుల ప్రజలు ఓటుతో పాటు, తమ ప్రేమను కురిపిస్తారని నమ్ముతున్నట్లు షర్మిల వెల్లడించారు. కడప ఎన్నికలు న్యాయానికి, నేరానికి మద్య జరుగుతున్న ఎన్నికలని పేర్కొన్నారు. వైఎస్ వివేకాకి తమ్ముడు, రాముడికి లక్ష్మణుడు లెక్క ప్రజల మధ్యే బతికిన వాడన్నారు. నెలలో 27 రోజులు ప్రజల కోసమే ప్రయాణం చేసేవాడని తెలిపారు. అలాంటి మంచి నాయకుడు హత్య జరిగి 5 ఏళ్లు దాటింది. ఈ 5 ఏళ్లలో సునీత న్యాయం కోసం తిరగని చోటు లేదు, తొక్కని గడప లేదు. అందుకే ప్రజా కోర్టు లో న్యాయం కోసం కొంగు చాచి అడుగుతున్నామని షర్మిల పేర్కొన్నారు. అవినాష్ రెడ్డి దోషి అని సీబీఐ ఆధారాలు చూపింది. కానీ అవినాష్ అరెస్ట్ కాకుండా జగన్ అడ్డుపడుతున్నారు. కర్నూల్ లో అరెస్ట్ చేయాలని చూస్తే 3 రోజులు కర్ఫ్యూ పెట్టారని షర్మిల గుర్తు చేశారు.
వివేకా భార్య సౌభాగ్యమ్మ: పులివెందుల ఆడపిల్లలు మీముందు ఉన్నారని, ఆడపిల్లలు ఐదేళ్లుగా ఎంత కష్టపడుతున్నారో మీకు తెలుసు అన్నారు. ఆడబిడ్డలు పుట్టింటికి వచ్చి న్యాయం అడుగున్నారని, ఆడబిడ్డలకు న్యాయం చేసే సమయం వచ్చిందన్నారు. అందరం షర్మిలకు ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. షర్మిలను ఎంపీ చేయాలని వివేకా భావించారని.. ఇప్పుడు ఆ అవకాశంల కడప ప్రజలకు వచ్చిందన్నారు. పార్టీలకతీతంగా షర్మిలను గెలిపించాలని సౌభాగ్యమ్మ పిలుపునిచ్చారు.
జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్ద సీబీఐ - ముగిసిన వాదనలు - CM Jagan Foreign Tour Petition