YCP Government Does Not Care About Araku Ghat Roads: అల్లూరి జిల్లాలో ప్రధానమైన రెండు ఘాట్ రోడ్లు ప్రమాదకరంగా మారాయి. పాడేరు, అరకులోయ ఘాటీలు దారుణంగా తయారయ్యాయి. వీటి నిర్వహణను వైసీపీ ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదు. ఈ పాడేరు, అరకులోయను వీక్షించేందుకు దూరప్రాంతాల నుంచి పర్యటకులు తరలివస్తుంటారు. వారికి ఈ మార్గాలపై అవగాహన లేక ప్రమాదాలకు గురవుతున్నారు. కనీసం ఇక్కడ రక్షణ సూచీలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడం లేదు.
రోడ్డు లేని కారణంగా నిలిచిన అంబులెన్స్ - మధ్యలోనే గర్భిణీ ప్రసవం - WOMAN DELIVERY ON ROAD
పాడేరు ఘాట్‌రోడ్‌లోని వంట్లమామిడి సమీపంలో ఐదు సంవత్సరాల క్రితం చింతపండు లోడుతో వెళ్తున్న ఓ లారీ అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. 2020లో వంట్లమామిడి వద్ద కాకినాడకు చెందిన ఓ బస్సు ప్రయాణికులతో వెళ్తున్న ప్రమాదవశాత్తు అదుపు తప్పి పక్కనే ఉన్న ఓ ఇంటిని ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న ముగ్గురు మృత్యువాత పడ్డారు. కందమామిడి మలుపు వద్ద గత మూడు సంవత్సరాలుగా ఐదుగురు యువకులు వేర్వేరుగా జరిగిన ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. ఈనెల 4వ తేదీన ఒడిశా నుంచి వలస కూలీలు వ్యాన్‌లో విజయవాడ వెళ్తుండగా పాడేరు ఘాట్‌రోడ్ సమీపంలో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. 22 మంది స్వల్పంగా గాయపడ్డారు.
వేసిన 3 నెలలకే పెచ్చులూడిపోయిన రోడ్డు - ఓట్ల కోసమే వేశారని స్థానికుల ఆగ్రహం - వీడియో వైరల్
Potholes on Ghat Roads: అరకు ఘాట్‌రోడ్డు సుమారు 45 కిలోమీటర్లు ఉంటుంది. ఈ మార్గంలో ప్రమాదకర ప్రదేశాలు 50 వరకు ఉన్నాయి. గతంలో టీడీపీ ప్రభుత్వం అరకులోయ- విశాఖపట్నం మార్గం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టింది. అరకు నుంచి పెందుర్తి వరకు ఉన్న ప్రధాన రహదారి నిర్వహణకు చర్యలు చేపట్టింది. ఐదు సంవత్సరాలపాటు రహదారి నిర్వహణకు ప్రపంచ బ్యాంకు నిధులు రూ. 21 కోట్లు కేటాయించింది. ఆ ఐదు సంవత్సరాలపాటు ఈ మార్గంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా రోజుల వ్యవధిలోనే సమస్య పరిష్కరించేవారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక అరకులోయ నుంచి విశాఖపట్నం మార్గంలోని ఘాట్ రోడ్డును పూర్తిగా విస్మరించారు. గుంతలమయంగా మారిన రహదారికి మరమ్మతులు చేయడం మర్చిపోయారు. వాహనదారులు ఆజాగ్రత్తగా ఉంటే మాత్రం ప్రమాదాలకు గురవుతారు.
రహదారి లేక మధ్యలోనే నిలిచిన అంబులెన్స్- కుమారుడి మృతదేహాన్ని మోసుకుంటూ గ్రామానికి
సుమారు ఐదు కిలోమీటర్ల మార్గంలో పది చోట్ల కొండపై నుంచి బండరాళ్లు జారి రహదారి పక్కగా పడిపోయాయి. సుంకరమెట్ట, డముకు తదితర ప్రదేశాల్లో రహదారి గుంతల్లో పడి పలువురు గాయాలయ్యాయి. నాలుగు సంవత్సరాల తర్వాత ఈ రహదారిని రాష్ట్ర ప్రభుత్వం జాతీయ రహదారి అధికారులకు అప్పగించినట్లు పేర్కొంది. కొంత ప్రాంతాన్ని ఎన్‌హెచ్ అధికారులు బాగు చేసినా తర్వాత వదిలేశారు. పాడేరు రోడ్డును సుమారు ఐదు దశాబ్దాల క్రితం నిర్మించారు. గతంలో మాజీ మంత్రి బాలరాజు హయాంలో దీని విస్తరణ పనులు చేపట్టారు. అప్పటి వరకు ఐదు మీటర్లున్న రహదారిని ఏడు మీటర్ల వరకు విస్తరించారు. ప్రమాదకర మలుపుల వద్ద మాత్రం వెడల్పు చేయలేదు.
ఎన్నాళ్లీ డోలీ మోతలు - ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న గిరిజనులు - NO ROADS IN TRIBAL AREAS