ETV Bharat / state

తిరుమలలో కడియం కొన్న భక్తుడు- రూంకి వెళ్లి చూసి షాక్​! - OTHER RELIGION SYMBOLS IN TIRUMALA

అన్యమత గుర్తులు ఉన్న వస్తువులను విక్రయిస్తున్న దుకాణం సీజ్​

ttd_officials_temporarily_closed_a_shop_selling_other_religion_items_symbols_in_tirumala
ttd_officials_temporarily_closed_a_shop_selling_other_religion_items_symbols_in_tirumala (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 6, 2024, 10:42 AM IST

Updated : Dec 7, 2024, 12:19 PM IST

TTD Officials Temporarily Closed a Shop Selling Other Religion items symbols in Tirumala : తిరుమలలో అన్యమత గుర్తులు ఉన్న వస్తువులను విక్రయిస్తున్న దుకాణాన్ని టీటీడీ అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. హైదరాబాదుకు చెందిన ఓ కుటుంబం సీఆర్​ఓ కార్యాలయం ఎదుట ఉన్న దుకాణంలో చేతికి ధరించే కడియాన్ని కొనుగోలు చేశారు. తర్వాత అక్కడి నుంచి అతిథి గృహానికి వెళ్లి చూడగా ఆ కడియంపై అన్యమతానికి సంబంధించిన పేరు, గుర్తు ఉంది.

తిరుమలలో కడియం కొన్న భక్తుడు- రూంకి వెళ్లి చూసి షాక్​! (ETV Bharat)

దీంతో ఒక్కసారిగా ఖంగుతిన్న భక్తులు ఆ విషయాన్ని టీటీడీ ఛైర్మన్ బీఆర్​. నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన అధికారులు సంబంధిత దుకాణంలో తనిఖీలు నిర్వహించి మూసివేశారు. బాధిత దుకాణదారుడు మాత్రం తాము అమ్మిన వస్తువులపై అన్యమత గుర్తులు ఉన్నట్లు తెలియదని అధికారులకు చెప్పుకొచ్చారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

'నేను హైదరాబాద్​ నుంచి వచ్చాను. 5వ తేదీ (గురువారం) తిరుపతికి చేరుకున్నాను. శుక్రవారం దర్శనం చేసుకున్నాను. ఆ తరువాత ఇక్కడే దుకాణాల్లో పిల్లలకు కొన్ని వస్తువులు కొన్నాను. వాటిపై అన్యమత గుర్తులు ఉన్నాయి. హిందూ దేవలయంలో ఇలాంటివి అమ్మడం ఏంటని దీని మీద నేను ఫిర్యాదు చేస్తున్నాను.' - భక్తుడు

తిరుమల భక్తులకు గుడ్​న్యూస్​ - కావాల్సినన్ని లడ్డూలు - ఎప్పటినుంచో తెలుసా?

ఆనంద నిలయం స్వర్ణమయం పథకాన్ని పునఃప్రారంభించనున్న టీటీడీ

Last Updated : Dec 7, 2024, 12:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.