ETV Bharat / state

శాసన సభ సమావేశాల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై సమీక్ష​- రేపటి నుంచే అసెంబ్లీ సెషన్స్​ - Sridhar about Protocol in Assembly

Minister Sridhar Review and arrangements for Assembly Sessions : శాసనసభ సమావేశాలు సజావుగా సాగేందుకు అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని సభాపతి ప్రసాద్‌కుమార్‌, శాసన మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, మంత్రి శ్రీధర్‌ బాబు అధికారులను ఆదేశించారు. అనంతరం అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, భద్రతాపై సమీక్ష నిర్వహించారు.

Council Chairman Gutha Sukender Reddy about Assembly Session
Minister Sridhar Review and arrangements for Assembly Sessions
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 7, 2024, 10:10 PM IST

శాసన సభ సమావేశాల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై సమీక్ష​- రేపటి నుంచే అసెంబ్లీ సెషన్స్​

Minister Sridhar Review and Arrangements for Assembly Sessions : శాసనసభ సమావేశాలకు ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా సజావుగా జరిగేట్లు అవసరమైన భద్రత ఏర్పాటు చేయాలని, సభ్యుల ప్రశ్నలకు త్వరితగతిన సమాధానాలు అందేట్లు చూడాలని స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌, మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌ బాబు అధికారులను ఆదేశించారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలపై ఇవాళ అసెంబ్లీలో శాసన సభ సమావేశాలు - నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై అధికారులతో సమీక్షాసమావేశం నిర్వహించారు.

Council Chairman Gutha Sukender Reddy about Assembly Session : సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు త్వరితగతిన అందించాలని, సమావేశాల సమయంలో సంబంధిత అధికారులు తప్పకుండా అందుబాటులో ఉండేలా చూసుకోవాలని మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. అసెంబ్లీ ప్రాంగణంలోని మండలి షిఫ్టింగ్ త్వరగా జరిగేలా చర్యలు చేపట్టాలని, రాష్ట్ర ప్రభుత్వం సత్వరం చర్యలు తీసుకునేలా శాసన సభ వ్యవహారాల మంత్రి తోడ్పాటు అందించాలని కోరారు. భద్రత, రక్షణ వ్యవహారాల విషయంలో పటిష్ఠ చర్యలు తీసుకోవాలని, సమావేశాల సమయంలో ధర్నాలు, ర్యాలీల అనుమతి విషయంలో ఆచితూచి చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

ఎలాంటి లోటుపాట్లు లేకుండా సమావేశాలు నిర్వహించేలా చూడాలని, ఇందుకు తగిన ఏర్పాట్లు ఆయా విభాగాల అధికారులు దగ్గరుండి పర్యవేక్షించాలని శాసన సభ స్పీకర్(Assembly Speaker) గడ్డం ప్రసాద్ కుమార్ అధికారులను ఆదేశించారు. సభ్యుల ప్రశ్నలకు సాధ్యమైనంత త్వరగా సమాధానాలు ఇవ్వాలని, సమావేశాలు జరుగుతున్నప్పుడు మంత్రులు అందుబాటులో ఉండేలా చూడాలని పేర్కొన్న డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్​ అసెంబ్లీ కమిటీల ఏర్పాటును త్వరగా పూర్తి చేయాలన్నారు.

Minister Sridhar Babu about Protocol in Assembly : మండలి, శాసన సభకు ఎన్నికైన నూతన సభ్యులకు ఓరియంటేషన్ కార్యక్రమం (Orientation Programme) ఏర్పాటు చేయాలని, శాసన సభ సమావేశాల సమయంలో అన్ని విభాగాలను సమన్వయం చేసేందుకు సీనియర్‌ ఐఎఎస్‌ను(IAS) ఏర్పాటు చేయాలని శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సీఎస్‌ను ఆదేశించారు. త్వరితగతిన సమాధానాలు సభ్యులకు అందించేందుకు ఇబ్బంది లేకుండా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. మంత్రులకు సబ్జెక్టుల వారిగా బాధ్యతలు ఇస్తున్నామని, సభ్యుల ప్రశ్నలకు వీలైనంత త్వరగా సమాధానాలు అందేలా చర్యలు తీసుకోవాలని సీఎస్​కు మంత్రి సూచించారు.

ప్రోటోకాల్ విషయంలో తప్పిదాలు జరగవద్దని, గతంలో ప్రోటోకాల్ విషయంలో తాను కూడా బాధితుడినని మంత్రి శ్రీధర్ బాబు గుర్తు చేశారు. మండలిని అసెంబ్లీ ప్రాంగణంలోకి త్వరితగతిన షిఫ్ట్​ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సమస్యలుంటే వెంటనే పరిష్కారం చేయాలని చీఫ్ సెక్రటరీ, అసెంబ్లీ సెక్రటరీని మంత్రి ఆదేశించారు. కొత్త సభ్యుల కోసం సమావేశాల తర్వాత రెండు రోజుల ఓరియంటేషన్ కార్యక్రమం ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు.

'హైదరాబాద్ పేరు, గుర్తింపు దెబ్బతినకుండా మరింత అప్రమత్తంగా పని చేయాలి'

బీజేపీకి బాబు మోహన్ గుడ్ ​బై - రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.