ETV Bharat / state

'మీ ఎస్బీఐ రివార్డ్‌ రూ.7,250 యాక్టివేట్‌ అయింది' - ఇలాంటి మెసెజ్​ మీకూ వచ్చిందా? అయితే జాగ్రత్త - SBI Redeem Pont Reward Scam

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 18, 2024, 2:45 PM IST

SBI Fake Reward Points Message : డియర్ కస్టమర్, మీ ఎస్బీఐ రివార్డ్‌ రూ.7,250 యాక్టివేట్‌ అయింది. అది ఈ రోజుతో ముగిసిపోతుంది. డబ్బులు పొందేందుకు ఎస్బీఐ రివార్డ్స్‌ యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకోండి. తద్వారా మీ ఖాతాలో డబ్బులు జమ చేసుకోండి' అంటూ మీకూ మెసేజ్ వచ్చిందా? అయితే జాగ్రత్త. తొందరపడి ఓపెన్ చేశారో మీ ఖాతా ఖాళీ అవడం పక్కా. ఇంతకీ ఈ మెసేజ్​లోని మతలబేంటో ఓసారి చూడండి.

SBI Fake Reward Points Message
'మీ ఎస్బీఐ రివార్డ్‌ రూ.7,250 యాక్టివేట్‌ అయింది' - ఇలాంటి మెసెజ్​ మీకూ వచ్చిందా? అయితే జాగ్రత్త (ETV Bharat)

Fake SBI Reward Points Fraud : స్మార్ట్‌ఫోన్‌ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. డిజిటల్‌ లావాదేవీలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో సైబర్‌ మోసాలు కూడా అంతగానే పెరిగాయి. అందరినీ బురిడీ కొట్టించేలా ఫోన్‌కాల్స్‌ చేయడం, లాటరీ తగిలిందని, తక్కువ ధరలో బ్రాండెడ్‌ వస్తువులని ఏదో ఒక సందేశం పంపి నకిలీ లింకులు చేరవేస్తూ ఆకర్షితులైన వారి ఖాతా నుంచి డబ్బులు కాజేస్తున్నారు. అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు విస్తృత ప్రచారం చేస్తూ ప్రజల్లో అవగాహన తీసుకొస్తున్నారు. దీంతో సైబర్ నేరాల పట్ల ప్రజల్లో కొద్దిగా మార్పు వచ్చింది. ప్రజల్లో అవహహన పెరిగే కొద్దీ సైబర్‌ మోసగాళ్లు తమ పంథాను మార్చుకుంటున్నారు. ఎప్పటికప్పుడు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఎస్బీఐ రివార్డ్స్‌ పేరిట నకిలీ లింకులను చేరవేసి డబ్బులను కాజేస్తున్నారు.

తెలిసిన నంబర్ల నుంచి మెసేజ్​లు : నిర్మల్‌ పట్టణానికి చెందిన ప్రవీణ్‌కుమార్‌ స్థానికంగా వీడియోగ్రాఫర్‌. అతనికి పరిచయాలు ఎక్కువ. ఇతడి వాట్సప్‌ నంబరు నుంచి పలు గ్రూపులకు ఎస్‌బీఐ రివార్డ్స్‌ పేరిట సందేశం చేరడంతోపాటు ఓ లింకు కూడా జతైంది. ఎందుకిలా పంపిస్తున్నారని అందరూ ఆశ్చర్యపోయారు. ఒకరిద్దరు అతడికి కాల్‌ చేసి విషయంపై అడిగారు. తన ఫోన్‌లో వాట్సప్‌ పనిచేయడం లేదని, తనకు తెలియకుండానే ఎవరో హ్యాక్‌ చేశారని చెప్పడంతో వారు షాకయ్యారు. లింకులేవీ తెరవొద్దని సూచించడంతో అందరు జాగ్రత్త పడ్డారు.

సైబర్​ నేరాలపై కేంద్రం ఉక్కుపాదం- 28200 మొబైళ్లు బ్లాక్​- 20లక్షల నంబర్లు కట్! - DOT BLOCKS MOBILE HANDSETS

ఇటీవల జైనూరు మండలం శివునూర్‌కు చెందిన ఓ యువ రైతు ఈ లింకు బారిన పడి భారీగా డబ్బులు నష్టపోయారు. తమ గ్రామం పేరిట ఉన్న వాట్సప్‌ గ్రూపులో ఎస్‌బీఐ రివార్డ్స్‌ లింకు రావడంతో నిజమేననుకుని దాన్ని తెరిచారు. అతడి ఖాతా నుంచి రూ.50 వేలు డ్రా అయినట్లు సందేశం రావడంతో షాక్ అయ్యాడు. వెంటనే పోలీసులకు, బ్యాంకు మేనేజరుకు ఫిర్యాదు చేశారు.

ఇవి తాజాగా ఉమ్మడి జిల్లా పరిధిలో చోటుచేసుకున్న ఘటనలు అలాగే స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పేరిట వాట్సప్‌లో రివార్డ్స్‌ లింకు విస్తృతంగా ప్రచారం అవుతోంది. తెలిసిన నంబర్ల నుంచే ఇది వస్తుండటంతో దాన్ని చూసినవారు నిజమని నమ్మి లింక్ తెరుస్తున్నారు. ఫలితంగా సులభంగా మోసపోయేందుకు అవకాశం ఉంటోంది.

'మీ ఎస్‌బీఐ నుంచి రివార్డ్‌ రూ.7,250 యాక్టివేట్‌ అయింది. అది ఈ రోజుతో ముగిసిపోతుంది. డబ్బులు పొందేందుకు ఎస్‌బీఐ రివార్డ్స్‌ యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకోండి, తద్వారా మీ ఖాతాలో డబ్బులు జమ చేసుకోండి’ అంటూ సందేశం పంపుతున్నారు. ఎస్‌బీఐ యోనో పేరిట ఓ లింకును సైతం జత చేయడంతో డబ్బులు స్వహా అవుతున్నాయి.

లింక్ క్లిక్ చేస్తే మారిపోతున్న పర్సనల్ డేటా : ఎవరైనా ఈ లింకును క్లిక్‌ చేసి యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసేందుకు ప్రయత్నిస్తారో వారి వాట్సాప్‌ ప్రొఫైల్‌ ఫొటో, పేరు ఎస్‌బీఐగా ప్రొఫైల్​గా మారిపోతున్నాయి. వివరాల్లో ఎస్‌బీఐ హెల్ప్‌లైన్‌ అంటూ వస్తుండటంతో చూసేవారందరూ అది నిజమైనదే అనుకుంటున్నారు. బాధితుడి ప్రమేయం లేకుండా అతడి ఫోన్‌లోని వివిధ వాట్సాప్‌ గ్రూపులకు సైతం ఈ లింకులు అటోమాటిక్​గా పోస్ట్‌ అవుతున్నాయి. పెద్దసంఖ్యలో వాట్సాప్‌ వినియోగదారులకు చేరుతుండటంతో ఒకరిద్దరు దీని బారినపడినా డబ్బులు నష్టపోవాల్సిందే. ఇలా ఈ చైన్‌ లింకు ఒకరి నుంచి ఒకరికి చేరుతూనే ఉంటోంది.

సైబర్‌ మోసగాళ్లు కొత్త మార్గాల్లో ప్రజలను మోసగించే ప్రయత్నం చేస్తున్నారని ఎస్పీ జానకి షర్మిల తెలిపారు . ఎస్‌బీఐ రివార్డ్స్‌ పేరిట వస్తున్న సందేశాలు సైతం ఈ తరహాలోనివేని అన్నారు. తెలిసిన వ్యక్తుల నుంచి వచ్చిందనో, మనవారే పంపారు కదా అని గుడ్డిగా నమ్మేయకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లింకులేవీ తెరవొద్దని సైబర్‌ నేరస్థుల ఉచ్చులో పడకూడదని జాగ్రత్తలు చెప్పారు. బాధితులు ఎవరైనా ఉంటే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ప్రతీ పోలీస్‌స్టేషన్‌లో సైబర్‌ వారియర్‌ పేరిట సిబ్బంది అందుబాటులో ఉన్నారని తెలిపారు. సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. అనుమానిత సందేశాలు, లింకుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని ఆమె అన్నారు.+

సైబర్ నేరగాళ్లు డబ్బులు కొట్టేశారా? సింపుల్​గా రికవరీ చేసుకోండిలా! - Recovering Money From Cyber Scams

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.