ETV Bharat / state

హైదరాబాద్​లో రియల్ ఎస్టేట్ పుంజుకుంది : సీఎం రేవంత్ రెడ్డి - CM Revanth On Hyderabad Real Estate

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 4, 2024, 3:54 PM IST

CM Revanth On Hyderabad Real Estate :​ గత ఆరునెలల్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పుంజుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దేశీయ, అంతర్జాతీయ ఆఫీస్ స్పేస్ లీజు రంగంలో 40 శాతం వృద్ధిలో దూసుకెళ్తుందని రేవంత్ రెడ్డి ఎక్స్​లో ట్వీట్ చేశారు. ఈ ఏడాదిలో మొత్తం 50 లక్షల చదరపు అడుగుల స్థలం అద్దెకు వెళ్లింది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి అద్దె లావాదేవీల్లో 40శాతం వృద్ది కనిపించిందని స్థిరాస్తి సేవల సంస్థ కుష్​మన్ అండ్ వేక్​ఫీల్డ్ నివేదిక వెల్లడించింది.

Hyderabad Real Estate
CM Revanth On Hyderabad Real Estate (ETV Bharat)

CM Revanth On Hyderabad Real Estate : హైదరాబాద్​లో గత ఆరునెలల్లో రియల్ ఎస్టేట్ పుంజుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దేశీయ, అంతర్జాతీయ ఆఫీస్ స్పేస్ లీజు రంగంలో 40 శాతం వృద్ధిలో దూసుకెళ్తుందని తెలిపారు. ఫలితాలను సాధించడమే ఏకైక లక్ష్యంతో హడావిడి లేకుండా పనిచేస్తున్న సమర్థవంత ప్రభుత్వ ప్రయోజనాలివని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రానున్న రోజుల్లో హైదరాబాద్ ఇమేజ్​ను పునర్నిర్మిస్తామని ముఖ్యమంత్రి అన్నారు. ఈ ప్రయాణంలో ప్రతీ ఒక్కరికి అవకాశాలను సృష్టిస్తామని భరోసా ఇస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్​లో ట్వీట్ చేశారు.

Hyderabad Real Estate : అంతర్జాతీయ సంస్థలతో పాటు దేశీయ కంపెనీల కార్యాలయాలు హైదరాబాద్​లో ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపడంతో ఇక్కడి కార్యాలయాల స్థలాలకు గిరాకీ పెరిగింది. ఈ ఏడాదిలో మొత్తం 50 లక్షల చదరపు అడుగుల స్థలం అద్దెకు వెళ్లింది. గత ఏడాది ఇదే కాలంలో 36 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని సంస్థలు అద్దెకు తీసుకున్నాయి. దీంతో పోలిస్తే ఈసారి అద్దె లావాదేవీల్లో 40శాతం వృద్ది కనిపించిందని స్థిరాస్తి సేవల సంస్థ కుష్​మన్ అండ్ వేక్​ఫీల్డ్ నివేదిక వెల్లడించింది. ప్రముఖ సంస్థలు తమ వ్యాపార విస్తరణకు హైదరాబాద్ కీలక స్థానంగా భావిస్తున్నాయని పేర్కొంది.

అందుబాటలో ఉండటమే హైదరాబాద్​లో కార్యాలయ స్థలానికి గిరాకీ పెరిగేందుకు ఇక్కడి మౌలిక వసతులతో పాటు, అనువైన వ్యాపార విధానాలు, స్థిరమైన ప్రభుత్వం లాంటివి తోడ్పడుతున్నాయని నివేదిక పేర్కొంది. ఇక్కడ స్థిరాస్థి ధరలు అందుబాటలో ఉండటం, నిఫుణుల లభ్యతా అనుకూలంగా ఉందని తెలిపింది. దీంతో హైదరాబాద్​పై పెట్టుబడిదారులు, స్థిరాస్థి డెవలపర్లు, సంస్థలూ సానుకూలంగా ఉంటున్నట్లు వెల్లడించింది. భవిష్యత్ విస్తరణ ప్రణాళికలకు వీలుగా ఉండేలా చూసుకోవడంతో పాటు, ఆధునిక వసతులు, కీలక ప్రాంతాల్లో ఉన్న గ్రేడ్ ఏ వాణిజ్య ప్రాజెక్టులకు అధిక గిరాకీ ఉందని నివేదిక పేర్కొంది. ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో కొత్తగా 27 లక్షల చదరపు అడుగుల స్థలం అందుబాటులోకి వచ్చిందని పేర్కొంది.

ఐటీ రంగంలో అత్యధిక లావాదేవీలు : అత్యధిక లీజింగ్ లావాదేవీలు ఐటీ, బీపీఎం రంగంలోనే జరిగాయి. మొత్తం అద్దెకు వెళ్లిన స్థలాల్లో 36శాతం వరకు ఈ సంస్థలే తీసుకున్నాయి. బ్యాంకింగ్, ఆర్థిక సేవల సంస్థలు 29శాతం స్థలాన్ని అద్దెకు తీసుకున్నాయి. ప్లెక్సిబుల్ వర్క్​ప్లేస్ సంస్థలు 17శాతం స్థలాన్ని తీసుకున్నాయి. వీటితో పాటు కో-లివింగ్ లాంటి వాటి కోసమూ అద్దె లావాదేవీలు జరిగాయి.

ఇంత ఎత్తైన భవనాలు ఎలా కడుతున్నారు? అధ్యయనానికి సిటీకి వచ్చిన దేశంలోని వేర్వేరు నగరాల బిల్డర్లు

కొత్త జోన్లు రియల్‌ అవకాశాలు - హైదరాబాద్​ ముఖచిత్రం ఎలా ఉండబోతోంది?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.