CBI Arrested BRS MLC Kavitha in Delhi Liquor Case : దిల్లీ మద్యం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను, తాజాగా కేంద్ర దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం తిహాడ్ జైలులో ఉన్న కవితను ప్రత్యేక కోర్టు అనుమతితో సీబీఐ కస్టడీలోకి తీసుకుంది. గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో అరెస్టు చేస్తున్నట్లు జైలు అధికారుల ద్వారా కవితకు దర్యాప్తు సంస్థ సమాచారం పంపింది. ఐపీసీ 477, 120(బి) సహా అవినీతి నిరోధక చట్టంలోని ఏడో సెక్షన్ ప్రకారం అరెస్టు చేసినట్లు తెలిపింది.
ఇందుకోసం రౌస్ అవెన్యూ కోర్టు నుంచి అనుమతి తీసుకున్నట్లు సీబీఐ వెల్లడించింది. శుక్రవారం ప్రత్యేక న్యాయస్థానంలో కవితను హాజరుపరచనున్న సీబీఐ, రిమాండ్ రిపోర్టు సమర్పించి ఆమెను కస్టడీకి కోరనుంది. ప్రత్యేక కోర్టు అనుమతిస్తే కేంద్ర కార్యాలయానికి కవితను తరలించి ప్రశ్నించనుంది. తిహాడ్ జైలులో ఉన్న తనకు బెయిల్ వస్తుందని ఆశలు పెట్టుకున్న కవితకు, సీబీఐ అరెస్ట్‌తో ఊహించని పరిణామం ఎదురైంది.
మద్యంతో జగన్‌కు ఆదాయం కిక్కు - పేదల ప్రాణాలకు ముప్పు: ఎన్డీఏ నేతలు - NDA Leaders on Liquor Ban IN AP
Kavitha Arrested In Delhi Liquor Scam : మద్యం విధానం రూపకల్పన కోసం అనేక ముడుపులు చేతులు మారాయని, ఈ పాలసీ రూపొందించిన ప్రైవేటు వ్యక్తులకు పూర్తి స్థాయిలో లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారంటూ తొలుత సీబీఐ కేసు నమోదు చేసింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు కేసు విచారణ జరుపుతున్న కేంద్ర దర్యాప్తు సంస్థ, 2022 డిసెంబర్ 11న తొలుత హైదరాబాద్‌లోని తన నివాసంలో కవితను మూడ్రోజుల పాటు విచారించింది.
CBI To Investigate MLC Kavitha : దిల్లీ మద్యం విధానం రూపకల్పన కేసులోనే గత నెల 15న కవితను ఈడీ అరెస్టు చేసి, 10 రోజుల పాటు విచారించగా, ఆ తర్వాత జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా ఆమె తిహాడ్ జైళ్లో ఉన్నారు. అటు కేసు దర్యాప్తులో భాగంగా శనివారం కోర్టు అనుమతితోనే కవితను తిహాడ్ జైల్లో సీబీఐ విచారించింది. సహ నిందితుడు బుచ్చిబాబు ఫోన్ నుంచి రికవరీ చేసిన వాట్సాప్ చాట్స్ ఆధారంగా ప్రశ్నించింది. దిల్లీ మద్యం పాలసీలో లిక్కర్ లాబీకి అనుకూలంగా వ్యవహరించేందుకు ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.100 కోట్ల ముడుపులు చెల్లించినట్లు వచ్చిన ఆరోపణపైనా విచారించినట్లు తెలుస్తోంది. సీబీఐ దగ్గర ఉన్న ఆధారాలతో శుక్రవారం రౌస్ అవెన్యు కోర్టులో హాజరు పరిచి కస్టడీకి కోరనుంది.
అత్యవసర విచారణకు నిరాకరించిన జడ్జి : సీబీఐ అరెస్టును సవాల్ చేస్తూ ప్రత్యేక కోర్టులో అత్యవసర విచారణకు ఎమ్మెల్సీ కవిత దరఖాస్తు చేసినా ఊరట దక్కలేదు. ప్రత్యేక న్యాయమూర్తి మనోజ్ కుమార్ బెంచ్ ముందు కవిత తరఫు న్యాయవాది మోహిత్‌రావు పిటిషన్ దాఖలు చేశారు. అయితే తన ఎదుట మద్యం కేసుకు సంబంధించి ఎలాంటి వాదనలు జరగలేదన్న న్యాయమూర్తి, ఈ కేసులో ఎలాంటి ఊరట ఇవ్వలేనని స్పష్టం చేశారు. కేసు గురించి ఎలాంటి సమాచారం లేదని, తనకు ఏ విషయం తెలియదన్నారు. అత్యవసర కేసులకు సంబంధించి వాదనలు మాత్రమే జరుగుతున్నాయని తెలిపారు. శుక్రవారం రెగ్యులర్ కోర్టులో దరఖాస్తు చేయాలని ప్రత్యేక కోర్టు జడ్జి మనోజ్ కుమార్ సూచించినట్టు న్యాయవాది మోహిత్‌రావు వెల్లడించారు.
ప్రభుత్వానికి సమాంతరంగా సొంత సైన్యం- వైసీపీ ప్రచారంలో ఎమ్మెల్వోలు - YSRCP Politics IN AP