ETV Bharat / state

బీఆర్ఎస్​కు షాక్ - బీజేపీలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌

BRS Leader Aroori Ramesh To Join BJP : వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే, వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు ఆరూరి రమేశ్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. నేడు హైదరాబాద్​లో కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీలో చేరెేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.

Aroori Ramesh Joins BJP Party
Aroori Ramesh Resign BRS
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 17, 2024, 7:27 AM IST

Updated : Mar 17, 2024, 9:01 AM IST

BRS Leader Aroori Ramesh To Join BJP : వరంగల్ జిల్లా వేదికగా రాజకీయ దుమారం రేపిన వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే, వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు ఆరూరి రమేశ్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. నేడు హైదరాబాద్​లో కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నేడు బీజేపీలో చేరెేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. రమేశ్ ఇన్ని రోజులు పార్టీ మారతారనే తతంగానికి ఎట్టకేలకు తెరపడింది.

Aroori Ramesh Resigns To BRS : బీఆర్ఎస్ నుంచి వరంగల్ ఎంపీ స్థానం తనకు కేటాయించకపోవడం వల్లే ఇన్ని రోజులు వెయిటింగ్ లిస్టులో ఉన్న ఆరూరి బీజేపీలో చేరడానికి రంగం సిద్దం చేసుకున్నట్లు సమాచారం. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నేడు హైదరాబాద్​లో బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. తొలుత ఆయన పార్టీ మారతారనే ప్రచారం మొదలవ్వగానే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రమేశ్​ను పిలిపించుకుని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఇక రాజకీయ భవిష్యత్తు బీజేపీతోనే అని భావించిన ఆరూరి బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

బీజేపీకి షాక్​ - జితేందర్​రెడ్డిని కలిసిన సీఎం రేవంత్​ రెడ్డి

EX MLA Aroori Ramesh BJP Joining : కొన్ని రోజుల నుంచి వర్ధన్నపేట వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ బీజేపీలో చేరుతున్నారని రాష్ట్ర రాజకీయాల్లో ప్రచారం దుమారం రేపింది. వరంగల్​ పార్లమెంటు స్థానానికి ఆరూరి బీజేపీ తరఫున పోటీ చేయనున్నట్లు ప్రచారం జరిగగా ఇదే విషయాన్ని మీడియాకు వెల్లడించేందుకు అప్పట్లో తన నివాసంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఆయన నివాసానికి వెళ్లిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్, ఎమ్మెల్సీ బస్వరాజ్​ సారయ్య బీఆర్​ఎస్​ను వీడవద్దంటూ ఆరూరి రమేశ్​ను బుజ్జగించే ప్రయత్నం చేశారు.

బీఆర్ఎస్​కు మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ రాజీనామా : ఆయనను కారులో ఎక్కించుకొని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వద్దకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఆరూరి రమేశ్​ను బీఆర్ఎస్ నేతలు కిడ్నాప్ చేశారంటూ ప్రచారం జరిగింది. దీనిపై ఆరూరి రమేశ్ వివరణ ఇచ్చారు. తనను ఎవరు కిడ్నాప్ చేయలేదని తెలిపారు. తమ పార్టీ నేతలతో కలిసి కేసీఆర్ వద్దకు వచ్చినట్లు చెప్పారు. తాను బీఆర్ఎస్​లోనే ఉంటానని ఏ పార్టీలో చేరనని స్పష్టం చేశారు. తాను అమిత్ షాను కలిశానని జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. తాజాగా ఆయన బీఆర్ఎస్​కు రాజీనామా చేసి బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు.

బీఆర్ఎస్​కు షాక్ - బీజేపీలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌

MLA Aroori Ramesh Help : మానవత్వం చాటుకున్న వర్ధన్నపేట ఎమ్మెల్యే

Last Updated : Mar 17, 2024, 9:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.