ETV Bharat / state

సామాజిక, ఆర్థిక ప్రగతిని నిర్దేశించే విలువైన సాధనమే ఓటు: గవర్నర్ అబ్దుల్ నజీర్ - ఏపీలో ఓటర్ల దినోత్సవం

14th National Voters Day Celebrations in AP: రాష్ట్ర వ్యాప్తంగా 14వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కళాశాలల్లో విద్యార్థులు ఓటు హక్కు విశిష్టతపై నినాదాలు చేస్తూ భారీ ర్యాలీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో సామాజిక, ఆర్థిక ప్రగతిని నిర్దేశించే విలువైన సాధనమే ఓటు అని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు.

National_Voters_Day_Celebrations_in_AP
National_Voters_Day_Celebrations_in_AP
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 25, 2024, 5:00 PM IST

14th National Voters Day Celebrations in AP: ఏపీలో 14వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కళాశాలల్లో విద్యార్థులు భారీ ఎత్తున పాల్గొని ర్యాలీలు చేపట్టారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని సచివాలయంలో ప్రతిజ్ణ కార్యక్రమాన్ని నిర్వహించారు. వయోజనుల్లో ఓటు హక్కు వినియోగం దాని ఆవశ్యకతపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో ప్రతి ఏటా దేశవ్యాప్తంగా జనవరి 25వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని సాధారణ పరిపాలన శాఖ స్పష్టం చేసింది.

ప్రజాస్వామ్య వ్యవస్థ గొప్పదనాన్ని బాహ్య ప్రపంచానికి చాటిచెప్పే విధంగా ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన ఆవశ్యకతను తెలియజేసే లక్ష్యంతో ఈ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించినట్లు తెలిపింది. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. ప్రవీణ్ కుమార్ ఉద్యోగులలో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సాధారణ పరిపాలన శాఖ, ఇతర విభాగాలకు చెందిన సచివాలయ ఉద్యోగులు హాజరయ్యారు.

రాష్ట్రంలో కొత్తగా ఓట్ల దొంగలు వచ్చారు: చంద్రబాబు

Governor Justice Abdul Nazeer Attend 14th National Voters Day: సామాజిక, ఆర్థిక ప్రగతిని నిర్దేశించే విలువైన సాధనమే ఓటు అని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. ఓటు అనే ఆయుధం ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన జాతీయ ఓటర్ల దినోత్సవంలో సీఎస్ జవహర్ రెడ్డి, సీఈవో ముకేష్ కుమార్​తో కలిసి గవర్నర్ పాల్గొన్నారు. ఓటరు నమోదులో ఉత్తమ పనితీరు కనబరిచిన కలెక్టర్లకు పురస్కారాలు అందజేశారు. యువ ఓటర్లకు గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. భవిష్యత్​కు పునాది వేసే ప్రజాస్వామ్య ఉత్సవంలో ఓటర్లందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.

"ఓటు హక్కు ద్వారా దేశ భవిష్యత్​ను మార్చడంలో ప్రతి పౌరుడిదీ ప్రధాన పాత్ర. ఓటు వేయడం అనేది పౌరుడి ప్రధాన బాధ్యత కూడా. దేశ అభివృద్ధి గమనాన్ని నిర్దేశించడంలో పౌరులు అంతా తమ బాధ్యతను నెరవేర్చాలి. సామాజిక, ఆర్థిక ప్రగతిని నిర్దేశించే విధానాలు సక్రమంగా ఉండాలంటే పౌరులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ప్రతి పౌరుడు ఓటు హక్కును వినియోగించుకుని దేశ భవిష్యత్​ను నిర్దేశించడంలో ప్రధాన పాత్రను పోషించాలి. ఓటు అనే వెలకట్టలేని విలువైన ఆయుధంతో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. మన ప్రతినిధిని ఓటు ద్వారా ఎన్నుకోవడం అంటే మన హక్కులను మనం రక్షించుకోవడమే. భవిష్యత్​కు పునాది వేసే ప్రజాస్వామ్య ఉత్సవంలో ఓటర్లంతా పాల్గొనాలి." - గవర్నర్ అబ్దుల్ నజీర్

ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో ఓటర్ల అవగాహన సదస్సులు

CS KS Jawahar Reddy Attend National Voters Day: భారత్​లో ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం ఉందని, ఇందులో ఓటు హక్కు చాలా కీలకమని సీఎస్ కె. ఎస్ జవహర్ రెడ్డి అన్నారు. ప్రజలకు ఓటు హక్కు కల్పించేలా మన ప్రజాస్వామ్యం రూపుదిద్దుకుందని తెలిపారు. 1949లో రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడే మనకు ఓటు హక్కు వచ్చేలా నిర్ణయం తీసుకున్నారన్నారు.

1989లో ఓటు హక్కు వయస్సును 21 నుంచి 18 ఏళ్లకు కుదించారని తెలిపారు. సుప్రీం అధికారాలు అన్ని ప్రజల వద్దే ఉన్నాయన్నారు. ఓటు హక్కు ద్వారానే అది నాయకత్వానికి బదిలీ అవుతుందని అన్నారు. ప్రజలకు ఓటు అనే సార్వభౌమాధికారం ఉందన్న ఆయన దేశాలు అభివృద్ది చెందాలంటే ఓటు వేయడం చాలా ముఖ్యమని సీఎస్‌ కె. ఎస్‌. జవహర్‌రెడ్డి అన్నారు.

నేషనల్ ఓటర్స్ డే 2024- ఈ సారి థీమ్ ఏంటంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.