ETV Bharat / sports

విరాట్​ వాల్​పేపర్​గా బాబాజీ ఫొటో!- ఆయన ఎవరంటే? - Virat Wallpaper

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 5, 2024, 3:20 PM IST

Virat Kohli Phone Wallpaper: టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫోన్ వాల్​పేపర్ ప్రస్తుతం నెట్టింట హాట్​ టాపిక్​గా మారింది.

Virat Wallpaper
Virat Wallpaper (Source: Associated Press)

Virat Kohli Phone Wallpaper: టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫోన్ వాల్​పేపర్ ప్రస్తుతం నెట్టింట హాట్​ టాపిక్​గా మారింది. నీమ్ కరోలీ బాబా ఫొటోను విరాట్ తన ఫోన్​లో వాల్​పేపర్​గా ఉంచుకున్నాడంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్​ చేస్తున్నారు. మరి ఈ నీమ్ కరోలీ బాబా ఎవరు? ఆయన ఫొటోను విరాట్ ఎందుకు వాల్​పేపర్​గా సెట్ చేసుకున్నాడో నెటిజన్లు తెలుసుకోవాలనుకుంటున్నారు. మరి ఈయన ఎవరంటే?

నీమ్ బాబా కరోలి 1900లో జన్మించారు. అప్పట్లో ప్రజలకు ఆయన ఆధ్యాత్మికంగా దగ్గరయ్యారు. ఆయనను హనుమంతుని అవతారమని ప్రజలు నమ్ముతారు. బాబా కరోలి 1964 ఉత్తరాఖండ్ కైంచిలో తొలి ఆశ్రమాన్ని స్థాపించారు. ఉత్తరాఖండ్ సహా ఉత్తర్​ప్రదేశ్, దిల్లీల్లో కూడా ఆయన ఆశ్రమాలు ఉన్నాయి. మనిషి సంతోషంగా ఉండేందుకు జీవితంలో ఎలా ఉండాలో బాబా కరోలి అప్పట్లో లోకానికి చెప్పారంట. నమ్మకాన్ని ఎప్పుడూ కోల్పోవద్దని డబ్బు, సమయాన్ని ఎలా వినియోగించుకోవాలని ప్రజలకు బోధించేవారని తెలుస్తోంది. ఇక 1973లో ఆయన మృతి చెందారు.

అయితే విరాట్ గతంలో భార్య అనుష్క శర్మతో కలిసి ఉత్తరాఖండ్​లోని బాబా కరోలీ ఆశ్రమాన్ని సందర్శించారు. కెరీర్​లో ఫామ్ కోల్పోయినప్పుడు ఈ ఆశ్రమానికి విరాట్ వెళ్లాడట. దీంతో కోహ్లీ బాబా కరోలి ద్వారా ప్రేరణ పొంది ఉండవచ్చని నెటిజన్లు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు గౌరవంగా బాబా ఫొటోను కోహ్లీ, వాల్​పేపర్​గా పెట్టుకొని ఉండవచ్చని అంటున్నారు.​ కేవలం విరాట్ కోహ్లీయే కాకుండా ఫేస్​బుక్, ఆపిల్ సీఈవోలు మార్క్ జుకర్​బర్గ్, స్టీవ్ జాబ్స్ కూడా బాబా కరోలీని ఆచరిస్తారని సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది.

Neem karoli baba visit changed Virat kohli ji's fortune completely
That's beautiful ❤️pic.twitter.com/IbyV8P8Tka

— ً (@Worshipkohli) January 15, 2023

లండన్​కు విరాట్​
టీ20 వరల్డ్​కప్ విజయోత్సవ సంబరాలు ముగిసిన తర్వాత లండన్ పయనమయ్యాడు. గురువారం రాత్రే విరాట్ ముంబయి​ ఎయిర్​పోర్ట్​కు చేరుకున్నాడు. ఎయిర్​పోర్ట్​లో కోహ్లీ ఫోన్ వాడుతున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఈ క్రమంలోనే విరాట్ వాల్​పేపర్​ వైరల్​గా మారింది. కాగా, విరాట్ భార్య అనుష్క శర్మ, పిల్లలు చాలాకాలం నుంచి లండన్​లోనే ఉంటున్నారు.

డ్రమ్​ బీట్​కు అదిరే​ స్టెప్పులు- రోడ్డుపై రోహిత్​ డ్యాన్స్​- వీడియో చూశారా​? - T20 World Cup 2024

టీమ్ఇండియా 'రోడ్ షో' బస్సు రెడీ- వీడియో వైరల్- డిజైన్ అదిరిపోయిందిగా! - T20 World Cup 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.