ETV Bharat / spiritual

ఆ రాశుల వారికి వ్యాపారంలో లాభం- అన్ని పనుల్లో విజయం ఖాయం! - Daily Horoscope In Telugu

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 29, 2024, 4:25 AM IST

Horoscope Today June 29th 2024 : జూన్​ 29న (శనివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today June 29th 2024
Daily Horoscope In Telugu (ETV Bharat)

Horoscope Today June 29th 2024 : జూన్​ 29న (శనివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేష రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల వారికి ఖర్చులు పెరుగుతాయి. పనులు నెమ్మదిగా సాగుతాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి ఉన్నప్పటికినీ మీ ప్రతిభతో అధిగమిస్తారు. పనులు సకాలంలో పూర్తి చేసి ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. ఈ రోజు ఈ రాశి వారు ఆధ్యాత్మికత వైపు ఆసక్తి చూపుతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబంలో శాంతి లోపించవచ్చు. గురు శ్లోకాలు పఠిస్తే మనశ్శాంతిగా ఉంటుంది.

.

వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. స్నేహితులు, బంధువులతో శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారులకు ఏర్పడే కొత్త పరిచయాల వలన ఆర్ధికంగా లబ్ది పొందుతారు. పెట్టుబడులు పెట్టేందుకు మిత్రులు ముందుకు వస్తారు. ఉద్యోగంలో మార్పు కోరుకునే వారికి శుభ సమయం. ఉద్యోగులకు పదోన్నతులు ఉండవచ్చు. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళతారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సంపద వృద్ధి చెందుతుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ రోజు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి వృత్తి, వ్యాపారాలలో మంచి పురోగతి ఉంటుంది. మానసికంగా ప్రశాంతంగా, శారీరకంగా దృఢంగా ఉంటారు. ఉద్యోగులు వృత్తిపరంగా ప్రశంసలు అందుకుంటారు. ప్రమోషన్​కు సంబంధించి శుభవార్తలు వింటారు. సహోద్యోగుల సహకారం ఉంటుంది. సమాజంలో గౌరవం, ప్రతిష్ఠలు పెరుగుతాయి. శివారాధన శ్రేయస్కరం.

.

కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. విదేశాల నుంచి శుభప్రదమైన వార్త వస్తుంది. వృత్తి వ్యాపార రంగాల వారికి, చేపట్టిన పనుల్లో విజయం, ఆర్ధిక ప్రయోజనాలు లభిస్తాయి. ఈ రాశి వారికి ఈ రోజు అదృష్టం వరిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు ఉండవచ్చు. మీ పనితీరు పట్ల పై అధికారులు సంతృప్తి వ్యక్తం చేస్తారు. ఉద్యోగులు ప్రమోషన్ ఆర్డర్స్ అందుకుంటారు. దైవబలం మీద సంపూర్ణ విశ్వాసంతో ఉండండి. గణపతి ప్రార్ధన శుభకరం.

.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు కొన్ని ప్రతికూల పరిస్థితులు ఉండవచ్చు. అనారోగ్య సమస్యల కారణంగా ఖర్చులు విపరీతంగా ఉంటాయి. పని నుంచి కాస్త విరామం తీసుకోండి. తగిన విశ్రాంతి అవసరం. వృత్తి, ఉద్యోగ రంగాల వారికి ఆశించిన ప్రయోజనాలు ఉండకపోవచ్చు. వ్యాపారుల విషయంలో, గతంలో మీ నుంచి మేలు పొందిన వారే మీకు పోటీ కావచ్చు. సమయానుకూలంగా నడుచుకుంటే సమస్యలు ఉండవు. పనిలో సానుకూలత కోసం, మెరుగైన ఆర్ధిక ప్రయోజనాల కోసం కార్యసిద్ధి హనుమాన్​ను ప్రార్ధించండి.

.

కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. గ్రహసంచారం అనుకూలంగా ఉన్నందున అన్ని రంగాల వారు కెరీర్​లో దూసుకుపోతారు. చేపట్టిన ప్రతి పనిలోను విజయం సాధిస్తారు. సంపాదన పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. గతంలో మిమ్మల్ని విమర్శించిన వారే మీ సహాయం కోరి వస్తారు. ఇదే కదా విజయం అంటే! ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు ఈ రోజు పని ఒత్తిడితో తీరిక లేకుండా ఉంటారు. నూతన వస్తు, వాహనాలు కొంటారు. ఆదాయం వృద్ధి చెందుతుంది. పొదుపు ప్రణాళికలు వేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలకు వెళతారు. కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. కళాకారులకు సమాజంలో కీర్తి, గుర్తింపు లభిస్తాయి. ఆంజనేయ స్వామి ఆలయ సందర్శన శుభకరం.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ రోజు ఆనందదాయకంగా ఉంటుంది. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మంచి ఆరోగ్యం ఉంటుంది. ఉద్యోగులకు సహోద్యోగుల సహకారం, మద్దతు ఉండవచ్చు. వ్యాపారులు వ్యూహాత్మకంగా వ్యవహరించి పోటీదారులను అధిగమిస్తారు. ధనానికి లోటుండదు. ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తారు. కుటుంబంలో సంతోషం, ఆనందం ఉంటాయి. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ సందర్శన మేలు చేస్తుంది.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సు రాశి వారికి ఈ రోజు ప్రతికూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదురవుతాయి. తగిన చికిత్స, విశ్రాంతి అవసరం. కోపాన్ని అదుపులో పెట్టుకోలేని మీ అశక్తత కారణంగా ఇంటా, బయటా కలహాలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులను వాయిదా వేస్తే మంచిది. ఆర్ధిక లావాదేవీలలో మోసాలకు గురి కాకుండా జాగ్రత్తగా ఉండండి. కళలు, సాహిత్యం రంగం వారికి శుభ ఫలితాలు ఉంటాయి. గొప్ప అవకాశాలను అందుకుంటారు. సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటారు. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మేలు జరుగుతుంది.

.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. లక్ష్య సాధన కోసం తీవ్ర కృషి అవసరం. వృత్తి వ్యాపార రంగాల వారు పనులు సకాలంలో పూర్తి చేయలేక పోతారు. పై అధికారుల నుంచి ఒత్తిడి ఉండవచ్చు. గృహంలో శాంతి, సౌఖ్యం ఉంటాయి. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరుగుతాయి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. ఈశ్వర ఆరాధన శ్రేయస్కరం.

.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకోవడంలో సందిగ్దత నెలకొంటుంది. వృత్తి వ్యాపార రంగాల వారికి పనిభారం పెరుగుతుంది. కోపాన్ని అదుపులో పెట్టుకోకపోతే, కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు రావచ్చు. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. విద్యార్ధులు చదువు పైన దృష్టి సారించాలి. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం కావడానికి కొంత సమయం పడుతుంది. కాస్త ఓపిక పట్టాలి. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తవుతాయి. ఆర్ధికంగా శుభ ఫలితాలు ఉంటాయి. బంధు మిత్రులతో విందు, వినోదాలలో పాల్గొంటారు. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. వ్యాపారులు వ్యాపార నిమిత్తం దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఖర్చులు అదుపులోనే ఉంటాయి. సంపాదన పెరుగుతుంది. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.