ETV Bharat / spiritual

ఈరోజు మీ రాశిఫలం ఎలా ఉందో తెలుసా? - Daily Horoscope In Telugu

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 28, 2024, 4:26 AM IST

Horoscope Today June 28th 2024 : జూన్​ 28న (శుక్రవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Daily Horoscope In Telugu
Daily Horoscope In Telugu (ETV Bharat)

Horoscope Today June 28th 2024 : జూన్​ 28న (శుక్రవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు, ఆర్ధిక ప్రయోజనాలు ఉంటాయి. అన్ని పనులు సాఫీగా సాగిపోతాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. చిన్నపాటి అనారోగ్య సమస్యలుంటాయి. కుటుంబానికి ఎక్కువ సమయాన్ని కేటాయించండి. ఉద్యోగంలో మార్పు కోరుకునేవారికి, నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఆదిత్య హృదయం పారాయణ మేలు చేస్తుంది.

.

వృషభం (Taurus) : వృషభ రాశి వారికి ఈ రోజు అదృష్టకరంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం ఉంటుంది. అధికారం, సమాజంలో గౌరవం, ఆర్థిక పరిస్థితి పెరుగుదలకు కూడా అవకాశం ఉంది. ఉద్యోగులు పదోన్నతి పొందుతారు. వ్యాపారస్తులు వ్యాపారంలో పెద్ద ప్రాజెక్టును అందుకుంటారు. ఈ రోజు ఆర్థికపరంగా చేసే లావాదేవీలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ముఖ్యంగా స్థిరాస్తి రంగం వారికి శుభ ఫలితాలు ఉంటాయి. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఆర్ధిక పరంగా ఈ రోజు గొప్ప శుభదినం. ఎప్పటినుంచో రావలసిన డబ్బులు చేతికి అందుతాయి. సంపాదన పెరుగుతుంది. వ్యాపారాలు మంచి లాభాలను గడిస్తారు. ఆస్తి వ్యవహారాలు కూడా కలిసి వస్తాయి. ఉద్యోగులకు మెరుగైన ప్రయోజనాలు ఉంటాయి. అవివాహితులకు వివాహం నిశ్చయం అవుతుంది. బంధువుల ఇంట్లో శుభకార్యక్రమాలకు హాజరవుతారు. శివారాధనతో మరిన్ని మెరుగైన ప్రయోజనాలు ఉంటాయి.

.

కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు అన్నీ పనులు విజయవంతం అవుతాయి. ఉద్యోగస్తులు ఉన్నతాధికారులతో ముఖ్యమైన చర్చల్లో పాల్గొనవచ్చు. మీ పనితీరుతో అధికారులు సంతోషించి మీకు అదనపు బాధ్యతలను అందిస్తారు. జీతం పెరుగుదలకు కూడా ఆస్కారముంది. ఇంటి మరమ్మతుల నిమిత్తం అధిక ధనవ్యయం ఉండవచ్చు. సంపద పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

.

సింహం (Leo) : సింహ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈ రోజు ఈ రాశివారు ఆర్ధికంగా ఉన్నత స్థానానికి ఎదుగుతారు. పిత్రార్జిత ఆస్తులు కలిసి వస్తాయి. ధార్మిక, పవిత్రకార్యాలలో నిమగ్నం అవుతారు. కుటుంబ సభ్యులతో తీర్ధ యాత్రలకు వెళతారు. వృత్తి వ్యాపారాలు ఆటంకాలు లేకుండా కొనసాగుతాయి. అయితే కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో ఇతరులతో వాదనలకు దిగే అవకాశముంది. ఈ రోజు కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. గణపతి ప్రార్ధన శ్రేయస్కరం.

.

కన్య (Virgo) : కన్యా రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉండవచ్చు. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో విజయం ఉంటుంది. సమాజంలో గొప్ప పేరు ప్రఖ్యాతులను పొందుతారు. వ్యాపారస్తులకు, వారి భాగస్వాములకు మధ్య చాలా అనుకూలత ఉంటుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళతారు. విందు వినోదాలలో పాల్గొంటారు. ఇష్ట దేవారాధన శుభకరం.

.

తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. వ్యాపారులు వ్యాపారంలో మంచి లాభాలు అందుకుంటారు. కుటుంబ పరంగా మంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగస్తులు శ్రమకు తగిన ఫలితాన్ని అందుకుంటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. తీర్థయాత్రల కోసం ధనవ్యయం ఉంటుంది. ఆంజనేయ స్వామి ఆరాధన మేలు చేస్తుంది.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చిక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుంటారు. వృత్తి వ్యాపారాలలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారికి మీ ఎదుగుదలే సమాధానం అవుతుంది. ఇన్ని రోజుల నుంచి వేధిస్తున్న సమస్యలకు కారణాలు తెలుసుకుంటారు. మొహమాటాలకు పోయి చిక్కుల్లో పడే పరిస్థితులు తెచ్చుకోవద్దు. దైవబలం పట్ల విశ్వాసంతో ఉంటే అన్ని పరిస్థితులు చక్కబడతాయి. శ్రీరామ నామ స్మరణం మంచిది.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగులకు, వృత్తి నిపుణులకు తీవ్రమైన పని ఒత్తిడి ఉంటుంది. సహోద్యోగుల సహకారం ఉంటుంది. వ్యాపారులకు నష్ట సూచన ఉంది. కుటుంబంలో కలహాలు ఏర్పడవచ్చు. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. నిరుద్యోగులు లక్ష్యాన్ని చేరుకుంటారు. అనారోగ్య సమస్యలుంటాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

.

మకరం (Capricorn) : మకర రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఒక ఆహ్లాదకరమైన పర్యటనకు అవకాశం ఉంది. ఆస్తికి సంబంధించిన వ్యవహారాలు అన్నిటిపై శ్రద్ధ వహిస్తారు. ఈ రోజు ఉద్యోగస్తులకు, విద్యార్ధులకు అనుకూలంగా ఉండవచ్చు. వ్యాపారస్తులు పోటీదారులను అధిగమిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ సందర్శనం శుభకరం.

.

కుంభం (Aquarius) : కుంభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అనుకోని ఖర్చులు వస్తాయి. వృథా ఖర్చులు అదుపు చేసుకుంటే మంచిది. ఆర్ధికంగా బలోపేతం అవుతారు. ఉద్యోగులకు ప్రమోషన్, పదవీయోగం. ఆర్ధిక ప్రయోజనాలుంటాయి. స్నేహితులతో విందు వినోదాలలో పాల్గొంటారు. భాగస్వామ్య వ్యాపారాలలో మనస్పర్థలు ఏర్పడవచ్చు. సమష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి. గణపతి ప్రార్ధన శుభకరం.

.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. డబ్బుకు సంబంధించిన వ్యవహారాల్లో మోసపోయే ప్రమాదముంది. జాగ్రత్త వహించండి. వృత్తి వ్యాపారాలలో ఆటంకాల కారణంగా అసహనానికి గురవుతారు. సహనంతో ఉండడం అవసరం. పని ప్రదేశంలో ముఖ్యులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. కోపాన్ని అదుపులో ఉంచుకోకపోతే నష్టం తప్పదు. ఇంటా బయట కలహాలతో మనశ్శాంతి లోపిస్తుంది. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే ఉత్తమం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.