ETV Bharat / politics

అలా చేయడం వల్లే బీఆర్​ఎస్​ కష్టాల్లో పడింది - ఆ విషయంపై ఇప్పటికైనా నాయకత్వం దృష్టి సారించాలి : గుత్తా - Gutha Sukender Reddy on BRS

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 20, 2024, 9:37 PM IST

Gutha Sukender Reddy Suggestion to BRS : గత ప్రభుత్వం ప్రస్తుతం కష్టాల్లో ఉందని, గులాబీ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లోపించిందని శాసన మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. గత ఆరు నెలలుగా తాను కేసీఆర్​ను కలవడానికి ప్రయత్నించినా సాధ్యపడలేదన్న ఆయన, పార్టీ నిర్మాణంపై దృష్టి సారించాలని ఉద్భోదించారు.

Gutha Sukender Reddy on BRS Failure
Gutha Sukender Reddy Suggestion to BRS

Gutha Sukender Reddy on BRS Failure : రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్​ఎస్​ ఇవాళ కష్టాల్లో ఉందని శాసన మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి అన్నారు. పార్టీలో నిర్మాణం, అంతర్గత ప్రజాస్వామ్యం లోపించిందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే సెంట్రిక్​గా రాజకీయాలు చేయడం వల్లే ఇవాళ బీఆర్​ఎస్​ కష్టాల్లో పడిందని తెలిపారు. ఇతర పార్టీలకు వెళ్లిన ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని బీఆర్​ఎస్​ నేతలు ఫిర్యాదు చేశారని, దానిపై న్యాయబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

ఇవాళ నల్గొండ జిల్లా ఉరుమడ్లలో నిర్వహించిన మీడియా సమావేశంలో గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడారు. తాను పార్టీ మారుతున్న అనేది అవాస్తవమని, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నానని గుత్తా వివరించారు. అమిత్‌ రెడ్డికి ఎంపీ టికెట్‌ ఇవ్వలేదనేది పూర్తిగా అవాస్తవమన్నారు. స్వయంగా కేసీఆర్‌ ఫోన్‌ చేసి అమిత్‌ను ఎంపీగా పోటీ చేయాలని కోరారని తెలిపారు. దీనిపై జిల్లాలోని నాయకులు కొంతమంది సహకరిస్తామన్నారని, మరి కొంతమంది తామే పార్టీ మారుతున్నామని చెప్పారని పేర్కొన్నారు.

సమీక్ష లేకపోవడం వల్లే : అందుకే పోటీ నుంచి అమిత్‌ తప్పుకున్నారని గుత్తా సుఖేందర్‌రెడ్డి తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆరు నెలలుగా కేసీఆర్‌ను కలవడానికి ప్రయత్నించినా సాధ్యపడలేదన్నారు. పార్టీ నిర్మాణం, సమీక్ష లేకపోవడం వల్లే బీఆర్​ఎస్​కు ఈ పరిస్థితి వచ్చిందని, ఇప్పటికైనా బీఆర్​ఎస్​ నిర్మాణంపై నాయకత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సూచించారు.

'బీఆర్​ఎస్​ కొంత కష్టాల్లో ఉందన్న మాట వాస్తవం. దానికి ప్రధానమైన కారణం పార్టీలో నిర్మాణం లేకపోవడం, అంతర్గత ప్రజాస్వామ్యం లోపించడం. ఎమ్మెల్యేలు సెంట్రిక్​గా రాజకీయాలు నడపడం. ఈ అన్ని కారణాల వల్ల బీఆర్​ఎస్​ తగ్గింది. చాలా మంది నేను పార్టీ మారుతున్నానని ప్రశ్నిస్తున్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నా. నాకు ఏ పార్టీతో సంబంధం లేదు.' - గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన మండలి ఛైర్మన్‌

బీఆర్​ఎస్​లో నిర్మాణ లోపం, అంతర్గత ప్రజాస్వామ్యం లోపించింది : గుత్తా సుఖేందర్ రెడ్డి

జగదీశ్​ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు : గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గుత్తా సుఖేందర్ రెడ్డి రాజకీయ ఆరంభం రోజున తాను పుట్టనే లేదన్నారు. సుఖేందర్ రెడ్డి చాలా సీనియర్ నాయకుడని, పార్టీ నిర్మాణం గురించి ఆయన సలహాలు తీసుకుంటామన్నారు. ఏ పార్టీ ఎలా ఉంటుందని, వాటి నిర్మాణాల గురించి గుత్తాకు బాగా తెలుసని జగదీశ్‌రెడ్డి విమర్శించారు. గుత్తా వ్యాఖ్యల్లో రాజకీయ ప్రాధాన్యత లేదని, లోక్​సభ ఎన్నికల తర్వాత ఆయన మాట్లాడిన ప్రతి విషయంపై చర్చిస్తామన్నారు. ఎంపీ అభ్యర్థి నిర్ణయం, పోటీ గురించి ఇప్పుడు మాట్లాడనని, దానిపై స్పష్టత రావాల్సి ఉందన్నారు.

Gutha Sukender Reddy on Party Changing : 'ప్రస్తుతం రాజకీయాల్లో కొత్త ట్రెండ్ నడుస్తోంది.. మా పార్టీ వాళ్లే మాకు ఇబ్బందులు తెస్తున్నారు'

బీఆర్​ఎస్​కు మరో షాక్ - కాంగ్రెస్​లోకి గుత్తా అమిత్​ రెడ్డి !

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.