CM Chandrababu Review on CRDA at Collectors Conference : కలెక్టర్ల సదస్సులో సీఆర్డీఏపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సీఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాజధానికి సంబంధించిన రూ.15 వేల కోట్ల రుణాన్ని ఆసియా అభివృద్ధి బ్యాంకు తమ బోర్డు మీటింగ్లో క్లియర్ చేసిందని తెలిపారు. డిసెంబరు 19వ తేదీన ప్రపంచ బ్యాంకు బోర్డు కూడా అమరావతి రుణంపై నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. జనవరి నాటికి రూ.31 వేల కోట్ల రుణం అమరావతి నిర్మాణానికి అందుబాటులోకి వస్తుందని సీఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్ తెలిపారు.
జూన్లో సీఎం చంద్రబాబు పర్యటన తర్వాత రాజధాని నిర్మాణంపై రోడ్ మ్యాప్ ఇచ్చారని సీఆర్డీఏ కమిషనర్ తెలిపారు. గడచిన 3 నెలల్లో ధ్వంసమైన పరిస్థితుల్ని గాడిన పెట్టగలిగామని వివరించారు. గడచిన ఐదేళ్లలో పనులు ఆగిపోయాయని, చాలా మెటిరియల్ దొంగిలించారని వెల్లడించారు. రహదారులను కూడా తవ్వేశారని, యంత్రాలు కూడా పాడైపోయాయని అన్నారు. మొత్తంగా అంతా ధ్వంసమైన పరిస్థితి నుంచి మొదలు పెట్టి పునర్నిర్మాణం దిశగా అడుగులేస్తున్నామని భాస్కర్ తెలిపారు.
'రాష్ట్రమే ఫస్ట్.. ప్రజలే ఫైనల్' - ఆరు నెలల పాలనపై చంద్రబాబు, లోకేశ్ ఏమన్నారంటే!
రాజధాని పునర్నిర్మాణంపై ఇంజినీర్లు, ఐఐటీ చెన్నై, హైదరాబాద్ నిపుణులతో అధ్యయనం చేయించి ఓ రోడ్ మ్యాప్ ను సిద్ధం చేశామని సీఆర్డీఏ కమిషనర్ తెలిపారు. తాజాగా కొత్త పనులు చేపట్టేందుకు వీలుగా కార్యాచరణ సిద్ధం చేయగలిగామని వివరించారు. రూ.20,500 కోట్ల పనులు చేపట్టేందుకు ప్రభుత్వం నుంచి పాలనా అనుమతులు కూడా తీసుకున్నామని తెలిపారు. హడ్కో కూడా మరో రూ.11 వేల కోట్లు కూడా రుణం ఇచ్చేందుకు ఆమోదం తెలిపిందని వెల్లడించారు. మొత్తంగా 31 వేల కోట్ల రూపాయల మేర రుణం రాజధాని నిర్మాణాలకు అందుబాటులోకి వస్తుందన్నారు.
నిధులు ఇచ్చేందుకు ప్రపంచబ్యాంకు సిద్ధం: కీలకమైన నిర్మాణాలతో పాటు రైతులకు ఇచ్చే ఎల్పీఎస్ లే అవుట్లో చేపట్టాల్సిన మౌలిక సదుపాయాలు కూడా ఈ నిధులతోనే పూర్తి చేస్తామని భాస్కర్ అన్నారు. రాజధాని పనుల్లో మానవ వనరులకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు కూడా ప్రపంచబ్యాంకు నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని వెల్లడించారు. R 5 జోన్ కారణంగా మాస్టర్ ప్లాన్లో ఇబ్బందులు వచ్చాయని తెలిపారు. ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలోని లబ్దిదారులకు ఆయా జిల్లాల్లోనే ఇళ్ల స్థలాలు ఇచ్చేలా ప్రణాళిక చేశామని అన్నారు. ఆయా లబ్దిదారులకు స్థలాలు ఇచ్చేందుకు ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల కలెక్టర్లు ముందుకు రావాలని కోరారు. డీపీఆర్లు సిద్దం చేస్తే అందుకు అనుగుణంగా నిధులు కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామని కాటంనేని భాస్కర్ వెల్లడించారు.
పరిశ్రమల కోసం నానా తంటాలు పడుతున్నాం - సీరియస్గా ఫాలో అప్ చేయండి : సీఎం చంద్రబాబు
'ప్రజాతీర్పును జగన్ గౌరవించకపోతే ఎలా?' - వైఎస్సార్సీపీకి మరో ఇద్దరు గుడ్ బై