AP CEO Mukesh Kumar Meena Media Conference: హోం ఓటింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. జనవరి నుంచి ఇప్పటి వరకు సుమారు 180 కోట్ల మేర నగదు, ఇతర వస్తువులను సీజ్ చేశామని వివరించారు. 22 కోట్ల విలువైన మద్యం, 31 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ సీజ్ చేశామన్నారు. 41 కోట్ల మేర విలువైన ఆభరణాలు, పరికరాలు, వస్తువుల పట్టుబడిన్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 44 వేల 163 మంది వాలంటీర్ల రాజీనామా చేసినట్లు ఆయన వివరించారు. 1017 వాలంటీర్లను తప్పించామని మీనా తెలిపారు. ఇప్పటి వరకు వాలంటీర్లపై 86 కేసులు నమోదయ్యాయని తెలిపారు.
ప్రజాగళం సభ సూపర్ హిట్ - ప్రజలు, కార్యకర్తలకు చంద్రబాబు ధన్యవాదాలు - prajagalam Meeting success
ఎన్నికల్లో 5 లక్షల 26 వేల 10 మంది ఎన్నికల సిబ్బంది పాల్గోంటారని, పోలింగ్ డ్యూటీలో 3.30 లక్షల మంది నియమించినట్లు తెలిపారు. బ్రూవరీస్, డిస్టలరీస్ వద్ద వెబ్ క్యాస్టింగ్ ఏర్పాట్లు చేసిన్నట్లు తెలిపారు. మద్యం స్టోరేజ్ గొడౌన్ల వద్ద వెబ్ క్యాస్టింగ్, 30 వేల పోలింగ్ స్టేషన్ల వద్ద వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. అరకు, రంపచోడవరం, పాడేరు సెగ్మెంట్లల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, పాలకొండ, కురుపాం, సాలూరు సెగ్మెంట్లల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని వివరించారు.
మిగిలిన 169 సెగ్మెంట్లల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగనుందన్నారు. వీఐపీల భద్రత కోసం పోలీసులకు కొత్త ఎస్ఓపీ జారీ చేశామని అన్నారు. ముఖ్యమంత్రి జగన్‌పై రాయి దాడి ఘటనలో ఒకరిని అరెస్టు చేశారని మీనా తెలిపారు. ఈ వ్యవహారంపై పోలీస్ ప్రత్యెక పరిశీలకుడు త్వరలోనే దీనిపై ఈసీకి నివేదిస్తారని, తదుపరి చర్యలు ఉంటాయని మీనా తెలిపారు. అంతే కాకుండా పోలింగ్ విధుల్లో 3.3 లక్షల మంది సిబ్బంది ఉంటారని సీఈవో మీనా తెలిపారు. 300 కంపెనీల బలగాలు ఎన్నికల విధుల్లో ఉంటాయని ఇప్పటికే 100 కంపెనీల బలగాలు రాష్ట్రానికి వచ్చాయన్నారు. సమస్యాత్మక కేంద్రాల్లో 2 కెమెరాలతో పర్యవేక్షణ చేస్తామని వెల్లడించారు.
ఈ నెల 29న నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ఉంటుందని మే 13న పోలింగ్, జూన్ 4న లెక్కింపు జరుగుతుందని సీఈఓ తెలిపారు. రాష్ట్రస్థాయిలో ఇప్పటికే ముగ్గురు పర్యవేక్షకులు నియామించినట్లు తెలిపారు. ప్రతి జిల్లా, ప్రతి అసెంబ్లీ స్థానానికి పర్యవేక్షకులు వస్తారని ప్రతి 3-4 అసెంబ్లీ స్థానాలకు 50 మంది జనరల్ పర్యవేక్షకులు ఉంటారని తెలిపారు. ఈ నెల 22 వరకు హోమ్ ఓటింగ్‌కు అవకాశం ఉంటుందని తెలిపారు. 85 ఏళ్లు దాటినవారు, దివ్యాంగులకు పోస్టల్ బ్యాలెట్ ఫారాలు ఇస్తాం మని పోస్టల్ బ్యాలెట్ ఫారాలపై హోమ్ ఓటింగ్‌కు అనుమతి ఇవ్వాలని సూచించారు.
కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి: సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని ముకేశ్‌కుమార్ మీనా తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో అభ్యంతరకర పదజాలం వినియోగిస్తున్నారన్న ఫిర్యాదులపై కొందరు ముఖ్య నాయకులకు నోటీసులు జారీ చేశామన్నారు. వారు మళ్లీ అలాంటి పదాలు వాడితే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మంత్రులకు ఎన్నికల నియమావళి ఎలా అమలవుతుందో కేబినెట్ హోదా కలిగిన ప్రభుత్వ సలహాదారులకు కూడా అవే నిబంధనలు వర్తిస్తాయని పునరుద్ఘాటించారు. ప్రభుత్వ ఉద్యోగులు సస్పెండైన తర్వాత కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని తేల్చిచెప్పారు.