తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇక్కడ శివరాత్రికి కాదు, ఈరోజే శివపార్వతుల కల్యాణం

తూర్పున కాకుండా పడమర ముఖద్వారం.. శివరాత్రి రోజున కాకుండా హోలీ రోజు శివపార్వతుల కల్యాణం... ఈ తతంగమంతా పూర్తయ్యాకే.. రంగుల సందడి మొదలవుతుంది. ఇదేంటి వింతగా ఉంది ఎక్కడో అనుకుంటున్నారా..! మన యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోత్కూరులో.

By

Published : Mar 21, 2019, 1:51 PM IST

రారండో వేడుక చూద్దాం

రారండో వేడుక చూద్దాం
మోత్కూరు కేంద్రంలో శ్రీ రామలింగేశ్వరుని ఆలయానికి రెండు ప్రత్యేకతలున్నాయి. ఒకటి అన్ని దేవాలయాల ముఖద్వారం తూర్పుముఖంతో ఉంటే ఇక్కడ మాత్రం పడమర దిక్కున ఉంటుంది. రెండోది శివరాత్రి రోజు జరగాల్సిన శివ పార్వతుల కల్యాణం కాముని పున్నమి తర్వాత అంటే హోలీ రోజు జరుగుతుంది.

ఇక్కడిలా భిన్నంగాజరగడానికి ఒక పురాణ గాథ ప్రచారంలోఉంది. శివుని తపస్సు భగ్నం చేసేందుకు మన్మథుడు ప్రేమబాణం సంధించడం... ముక్కంటి ఆగ్రహానికి గురై దహనమైపోతాడు. అందుకు గుర్తుగా కామదహనం జరుపుకుంటారు. అర్థనారీశ్వరుల కోసమే కాముడు అగ్నికి ఆహుతయినందున... కామదహన వేళలోనే వారి కల్యాణం సముచితమని స్థానికుల అభిప్రాయం. ప్రతీ ఏటా హోలీ రోజు ఈ వైభవం జరిపిన తర్వాతే రంగుల పండుగ జరుపుకుంటారు.

ABOUT THE AUTHOR

...view details