తెలంగాణ

telangana

ETV Bharat / state

హాజీపూర్​లో సీసీ కెమెరాల ఏర్పాటు

నేరరహిత సమాజం కోసం నేనుసైతం అంటూ రాచకొండ కమిషనరేట్ పోలీసులు బొమ్మలరామారం మండలం హజీపూర్ గ్రామంలో సీసీ కెమెరాలను ప్రారంభించారు.

సీసీ కెమెరాల ఏర్పాటు

By

Published : May 25, 2019, 4:56 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజిపూర్ గ్రామంలో పోలీసులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ముగ్గురు మైనర్ బాలికలను అత్యాచారం చేసి హత్యచేసి బావిలో పాతిపెట్టిన ఘటనపై గ్రామస్థులు భయాందోళనకు గురి కావొద్దని.. మీ పిల్లలను ధైర్యంగా స్కూల్​కు పంపండి మేమున్నాం అంటూ ముందుకొచ్చారు. జిల్లా కలెక్టర్ అనితా రాంచంద్రన్, సీపీ మహేష్ భగవత్ కెమెరాల ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. 10 లక్షల 60 వేల రూపాయలతో 12 సీసీ కెమెరాలను ప్రారంభించామని తెలిపారు. మహిళలు భయబ్రాంతులకు గురికావొద్దనే సదుద్దేశంతో ఈ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. గ్రామంలో ఎలాంటి సమస్య వచ్చినా 9490617111కు వాట్సప్ చేయమని సీపీ సూచించారు.

సీసీ కెమెరాల ఏర్పాటు

ABOUT THE AUTHOR

...view details