తెలంగాణ

telangana

ETV Bharat / state

'సమయం మించితే... అప్పుల పాలవుతాం'

యూరియా కొరత వరంగల్​ రైతులను కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. సమయానికి ఎరువు వేయకపోతే... పంట దిగుబడి తగ్గుతుందనే భయంతో సహకార సంఘాల వద్ద రాత్రింబవళ్లు బారులు తీరుతున్నారు.

By

Published : Sep 19, 2019, 5:17 PM IST

'సమయం మించితే... అప్పుల పాలవుతాం'

'సమయం మించితే... అప్పుల పాలవుతాం'

యూరియా కొరత వరంగల్​ రైతులను ఆవేదనకు గురిచేస్తోంది. వరంగల్​ గ్రామీణ జిల్లా ఖానాపురం మండలంలో ఒక్కో రైతు 5 నుంచి 20 ఎకరాల వరకు సాగు చేస్తున్నారు. ఒక్కొక్కరికి ఒకటి, రెండు బస్తాల యూరియా మాత్రమే ఇస్తున్నారని అన్నదాతలు వాపోతున్నారు. సహకార సంఘాల వద్ద ఉదయం నుంచే పిల్లా పాపలతో క్యూ కడుతున్నారు. సరైన సమయానికి ఎరువులు వేయకపోతే పంట దిగుబడి తగ్గిపోయి అప్పుల పాలు కావాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు సరిపడా ఎరువులు సరఫరా చేయాలని కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details