తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతు యూరియా కష్టాలు తీరేదెన్నడు...?

మన ఐదు వేళ్లు నోటిలోకి వెళ్లాలంటే... రైతన్న పది వేళ్లు మట్టిలోకి వెళ్లాలి. మనం తింటున్న ప్రతీ మెతుకు అన్నదాత చెమట చుక్క ఫలితమే.. సరిహద్దులో సైనికుడు.. పొలంలో రైతు లేకుంటే మనం బతకలేం.. అలాంటి అన్నదాతను కష్టాలు పట్టి పీడిస్తున్నాయి. చుట్టు చేరి వేధిస్తున్నాయి. ప్రకృతి, చీడపీడలు ఓ పక్క... నకిలీ విత్తనాలు, ధరలేమి మరో పక్క కర్షకుడిని ఆగాధంలోకి నెడుతున్నాయి. వర్షాలు పడి పంట వేసినా ఇప్పుడు ఎరువుల కొరత వెంటాడుతోంది. యూరియా కోసం రైతన్నలు పడిగాపులు పడాల్సి వస్తోంది.

By

Published : Sep 13, 2019, 6:51 AM IST

యూరియా కోసం రైతల లైను

సూర్యాపేట రైతు యూరియా కష్టాలు

సూర్యాపేట జిల్లాలో రైతులను యూరియా కొరత వెంటాడుతోంది. జిల్లాలో ఇప్పటి వరకు లక్ష డెబ్భై వేల ఎకరాల్లో వరి సాగు అయినట్లు అధికారులు అంచనా వేశారు. వరితో పాటు పత్తి సాగు చేశారు. ఈ రెండు పంటలకు యూరియా అధికంగా కావాల్సి ఉంటుంది. ఇప్పటికే రెండుసార్లు వేయాల్సిన యూరియా ఒక్కసారి కూడా వేయలేదని రైతులు వాపోతున్నారు. వారం రోజులుగా యూరియా కోసం దుకాణాల వద్ద క్యూ కడుతున్నా తమకు యూరియా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

54 వేల మెట్రిక్ టన్నులు అవసరం

జిల్లాకు 54 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా ఆగస్టు చివరి వరకు 23 వేల మెట్రిక్ టన్నులు రావాల్సి ఉంది. 20 వేల మెట్రిక్ టన్నులే వచ్చింది. జిల్లాలోని ఎరువుల దుకాణాలకు ఉమ్మడి నల్గొండ జిల్లాల నుంచి రైతులు వస్తుండటం వల్ల కొరత ఏర్పడుతోందని అధికారులు గుర్తించారు. సాగర్ ఆయకట్టు ప్రాంతమైన నల్గొండ జిల్లాలోని రైతులు అధికంగా యూరియాను కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. కొనుగోలు తగ్గించేందుకు ప్రతీ రైతు ఆధార్ కార్డుతో రావాలని నిబంధన విధించారు.

నిల్వ వద్దు

యూరియా దొరకదన్న కారణంతో అవసరం లేకున్నా రైతులు నిల్వ చేయవద్దని వ్యవసాయ శాఖ అధికారులు కోరుతున్నారు. త్వరలోనే అదనపు సరుకు తెప్పిస్తామని హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి: గంగమ్మ చెంతకు: వెళ్లిరావయ్యా.. మళ్లీ రావయ్యా మహాగణేశా...

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details