తెలంగాణ

telangana

ETV Bharat / state

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన పీడీ

సూర్యాపేట జిల్లాలో రైతు పండించిన అన్నిరకాల ధాన్యం కొనుగోలు చేసే విధంగా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని డీఆర్​డీఏ పీడీ కిరణ్​కుమార్​ తెలిపారు. అవసరం ఉన్న చోట మరికొన్ని కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు.

By

Published : Mar 30, 2019, 2:53 PM IST

జిల్లావ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు

జిల్లావ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు
సూర్యాపేట జిల్లాలోని చివ్వెంల మండలంలోనిఐలాపురంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డీఆర్​డీఏ పీడీ కిరణ్​కుమార్​ ప్రారంభించారు. రైతు పండించిన ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. జిల్లాలో ఇప్పటివరకు 15 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని అన్నారు.ఈసారి లక్ష్యం 10లక్షల క్వింటాళ్లు
ఈ ఏడాది రబీ సీజన్​లో జిల్లాలో 10 లక్షల క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం సొమ్ము రైతుల ఖాతాల్లో సకాలంలో పడే విధంగా జిల్లా కలెక్టర్ ఇప్పటికే చర్యలు తీసుకున్నారని అన్నారు. దళారుల బారిన పడి నష్టపోకుండా రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని విజ్ఞప్తి చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details