తెలంగాణ

telangana

ETV Bharat / state

భూ సమస్య పరిష్కారానికొచ్చి వృద్ధురాలు మృతి

ఉన్న భూమిని తన పేరు మీద పట్టా చేయించుకునేందుకు కొన్నేళ్లుగా తిరిగి అలసిపోయిందో ఏమో... కార్యాలయంలోనే తుదిశ్వాస విడిచింది ఆ వృద్ధురాలు. సంగారెడ్డి ఆర్డీవో కార్యాలయంలో ఉండగా... మూర్ఛ వచ్చిన వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందింది.

OLD WOMEN DIED IN SANGAREDDY RDO OFFICE
OLD WOMEN DIED IN SANGAREDDY RDO OFFICE

By

Published : Feb 18, 2020, 7:31 PM IST

సంగారెడ్డి ఆర్డీవో కార్యాలయంలో విషాదం చోటుచేసుకుంది. భూ సమస్య పరిష్కారానికి వచ్చిన ఓ వృద్ధురాలు.. మూర్ఛ వచ్చి అక్కడికక్కడే కుప్పకూలి మృతిచెందింది. అందోల్ మండలం సైబాన్​పేట్ చెందిన రుక్కమ్మ అనే వృద్ధురాలు... భూమిని తన పేర పట్టా చేయాలంటూ కొన్నేళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతోంది.

ఈరోజు సంగారెడ్డి ఆర్డీవో కార్యాలయానికి వచ్చిన రుక్కమ్మ... మధ్యాహ్నం ఒంటి గంటకు అకస్మాత్తుగా కుప్పకూలింది. వెంటనే స్పందించిన అక్కడున్న జనాలు.... అంబులెన్స్​లో ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు.

భూపరిష్కారానికి వచ్చి మృతిచెందిన వృద్ధురాలు

ఇదీ చూడండి:రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్‌ కమిషనర్ల బదిలీ

ABOUT THE AUTHOR

...view details