తెలంగాణ

telangana

ETV Bharat / state

పంతులమ్మను వేధించిన ఆకతాయికి దేహశుద్ధి

రంగారెడ్డి జిల్లా హైదర్​గూడలో ఓ ఆకతాయికి స్థానికులు దేహశుద్ధి చేశారు. కాలనీలో నడుచుకుంటూ వెళ్తున్న ఓ ఉపాధ్యాయురాలితో అసభ్యంగా ప్రవర్తించగా స్థానికులు కోపోద్రిక్తులై దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

By

Published : Jun 26, 2019, 4:46 PM IST

హైదర్​గూడలో ఆకతాయికి దేహశుద్ధి

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ పరిధిలోని హైదర్​గూడలో ఆకతాయి యువకునికి స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. న్యూఫ్రెండ్స్ కాలనీలో ఓ ఉపాధ్యాయురాలు నడుచుకుంటూ వెళుతుండగా ఆకతాయి అమె చున్నీ లాగాడు. భయంతో ఆమె కేకలు వేయగా.. స్థానికులు గుమిగూడి ఆ పోకిరిని పట్టుకున్నారు. కోపోద్రిక్తులైన కొందరు స్థానికులు ఆ ఆకతాయికి దేహశుద్ధి చేసి రాజేంద్రనగర్ పోలీసులకు అప్పగించారు.

హైదర్​గూడలో ఆకతాయికి దేహశుద్ధి

For All Latest Updates

TAGGED:

pokiri

ABOUT THE AUTHOR

...view details