తెలంగాణ

telangana

ETV Bharat / state

కాంగ్రెస్ నేతలను చితకబాదిన పోలీసులు.. సీపీ సీరియస్..

పెద్దపల్లి జిల్లాలో పోలీసుల ఓవరాక్షన్ వెలుగు చూసింది. అకారణంగా ఐదుగురు కాంగ్రెస్ కార్యకర్తలను కొట్టగా.. కమిషనర్ సీరియస్ అయ్యారు. శాఖాపరమైన దర్యాప్తుకు ఆదేశించారు.

By

Published : Jun 13, 2019, 8:05 PM IST

అకారణంగానే మమ్మల్ని చితకబాదిన పోలీసులు

పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్​ పోలీసులు అకారణంగా తమపై దాడికి పాల్పడ్డారంటూ ఐదుగురు యువకులు తెలిపారు. ఈ నెల 4న ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి రమేష్ గెలుపొందిన సందర్భంగా కార్యకర్తలు టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ ఘటనపై 5న బసంత్ నగర్​ ఠాణాలో తెరాస నేతలు ఫిర్యాదు చేశారు. జూన్ 12న పోలీసులు జయ్యారం గ్రామానికి చెందిన సాగర్, అనిల్, మల్లయ్య, శివకుమార్, అనిల్​లను ఇంట్లో నుంచి తీసుకెళ్లి విచారించకుండానే చితకబాదినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ నేతల సహకారంతో రాత్రి జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు. పోలీసులు చేసిన గాయాలను చూపించి ఆందోళన వ్యక్తం చేశారు. విచారణ జరపకుండానే తమపై దాడికి పాల్పడిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.
ఈ ఘటనపై స్పందించిన రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ బసంత్ నగర్ ఎస్ఐ ఉమా సాగర్​ను కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్​కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం ఘటనపై పూర్తి విచారణ జరపాలంటూ పెద్దపల్లి డీసీపీ సుదర్శన్ గౌడ్ ఆదేశాలు జారీ చేశారు.

అకారణంగా మమల్ని పోలీసులు క్రూరంగా కొట్టారు : బాధితులు

ABOUT THE AUTHOR

...view details