తెలంగాణ

telangana

ETV Bharat / state

శీలం రంగయ్య మృతిపై సీపీ అంజనీకుమార్​ విచారణ

మంథని పోలీస స్టేషన్​ బాత్​రూంలో ఉరేసుకుని మృతి చెందిన శీలం రంగయ్య కుటుంబాన్ని హైదరాబాద్​ సీపీ అంజనీకుమార్​ విచారించారు. హైకోర్టులో పిటిషన్​ దాఖలు కాగా న్యాయస్థానం అంజనీకుమార్​ను విచారణాధికారిగా నియమించింది.

By

Published : Jun 9, 2020, 9:47 PM IST

hyderabad cp anjani kumar inquiry on sheelam rangaiah death in peddapalli district
శీలం రంగయ్య మృతిపై సీపీ అంజనీకుమార్​ విచారణ

పెద్దపల్లి జిల్లా మంథని పోలీస్ స్టేషన్ ఆవరణలో ఇటీవల బాత్​రూంలో ఆత్మహత్యకు పాల్పడిన శీలం రంగయ్య మృతిపై హైకోర్టు ఆదేశాల ప్రకారం హైదరాబాద్ సీపీ అంజన్ కుమార్ ఈరోజు విచారణ చేపట్టారు. వన్యప్రాణుల వేట కేసులో పట్టుబడిన రామగిరి మండలం బుధవారంపేట(రామయ్యపల్లికి) చెందిన రంగయ్ కుటుంబాన్ని సీపీ అంజనీకుమార్ విచారించారు.

పోలీసుల వేధింపుల కారణంగా రంగయ్య ఆత్మహత్యకు పాల్పడ్డారని హైకోర్టులో దాఖలైన పిటిషన్ మేరకు విచారణాధికారిగా అంజన్ కుమార్​ను నియమించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రంగయ్య కుటుంబ సభ్యులను విచారించి వివరాలు నమోదు చేసుకున్నారు. అనంతరం మైదుపల్లిలో మిగిలిన ఇద్దరు సహా నిందితులను విచారించి అనంతరం మంథని పోలీస్ స్టేషన్​లో రంగయ్య మృతి చెందిన ప్రదేశాన్ని పరిశీలించారు.

ఇవీ చూడండి: కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందా.. అయితే ఏం చేయాలంటే..

ABOUT THE AUTHOR

...view details