తెలంగాణ

telangana

ETV Bharat / state

'శాంతి భద్రతల పరిరక్షణకై... సీసీ కెమెరాల ఏర్పాటు'

నేర నియంత్రణకు, శాంతి భద్రతలకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని రామగుండం పోలీస్ కమిషనర్​ సత్యనారాయణ పేర్కొన్నారు. కమాన్​పూర్​ మండలంలో పలు గ్రామాల్లో 68 సీసీ కెమెరాలను... జడ్పీ ఛైర్మన్ పుట్ట మధుకర్​తో కలిసి ఆయన ప్రారభించారు.

By

Published : Jul 3, 2020, 4:14 PM IST

cc-cameras-launch-at-kamanpur-mandal-in-peddapalli-district
'శాంతి భద్రతల పరిరక్షణకై... సీసీ కెమెరాల ఏర్పాటు'

పెద్దపల్లి జిల్లాలోని కమాన్​పూర్​ మండలంలోని తొమ్మిది గ్రామాల్లో 68 సీసీ కెమెరాలతో కమాండ్ కంట్రోల్​ను రామగుండం పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ, పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధుకర్ ప్రారంభించారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేసిన అధికారులను, దాతలను సీపీ అభినందించారు.

తెలంగాణ పోలీస్ శాఖ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అన్ని స్థాయిల్లో వినియోగించుకుంటుందని సీపీ పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణలో ముందుకు సాగుతున్నామని వెల్లడించారు. ప్రజలతో మమేకం అవుతూ... సత్వర న్యాయం అందించేలా ఫ్రెండ్లీ పోలీసింగ్ దిశగా కృషి చేస్తున్నామన్నారు. శాంతి భద్రతల విషయంలో, నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. అనంతరం హరితహారంలో పోలీసు స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు.

ఇవీ చూడండి:పోలీసుల కాల్పుల్లో ఇద్దరు నేరస్థులు హతం

ABOUT THE AUTHOR

...view details