తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతు సమస్యకు గంటల్లోనే పరిష్కారం

సామాన్య ప్రజానికం ముఖ్యమంత్రిని కలవాలంటే చాలా కష్టమైన పని. కానీ... ముఖ్యమంత్రే మనకు ఫోన్​ చేసి నీ సమస్యేంటీ... బాధపడకు... నేనున్నా అంటూ భరోసా ఇస్తే... అంతకన్నా అదృష్టముంటుందా...! సమస్య తెలుసుకోవటమే కాదు గంటల్లోనే పరిష్కరించారు కూడా. అలాంటి అరుదైన సంఘటనే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చేసి రైతు బంధు సీఎం అంటూ నిరూపించుకున్నారు.

By

Published : Mar 27, 2019, 8:11 PM IST

Updated : Mar 27, 2019, 8:38 PM IST

యువకులకు సీఎం భరోసా...

యువకులకు సీఎం భరోసా...
మంచిర్యాల జిల్లా నెన్నెల్‌ మండలం నందులపల్లికి చెందిన యువ రైతు శరత్‌కు.. ముఖ్యమంత్రి కేసీఆర్​ స్వయంగా ఫోన్‌ చేశారు. ముఖ్యమంత్రేంటీ... సామాన్య రైతుకు ఫోన్​ చేయటమేంటీ అని ఆశ్చర్యంగా ఉందా...! అయితే విషయంలోకి వెళ్లాల్సిందే...!

యువరైతు బాధపడితే....

రైతుల సమస్యలకు పరిష్కారాలిస్తూ... సరికొత్త విధానాలను పరిచయం చేస్తూ... ఫేస్​బుక్​లో ఓ పేజీని నడుపుతున్నాడు యువ రైతు శరత్​. కానీ ఓ రోజు తన సమస్యనే వీడియో రూపంలో సీఎంకి చేరువ చేయండంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. తన భూమికి సంబంధించి ఉన్న సమస్యను, దానికి గ్రామ అధికారులు వ్యవహరించిన తీరును వీడియోలో వివరించాడు.

ముఖ్యమంత్రే ఫోన్​ చేశారు...

వీడియో పెట్టిన పది రోజులకు అనూహ్యంగా... శరత్​... నేను సీఎంని మాట్లాడుతున్నా.... మీ సమస్యేంటీ...? అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రే ఫోన్​ చేసి మాట్లాడారు. సమస్యను అడిగి తెలుసుకున్నారు. బాధితుని గోడును సావదానంగా విన్న సీఎం... న్యాయం చేస్తామని అభయమిచ్చారు.

సీఎంతో ఆవేదన చెప్పుకున్నాడు...

తాతల నాటి నుంచి వస్తున్న తమ జీవనాధార భూమిని వేరొకరు అప్పనంగా పట్టా చేసుకున్నారని శరత్​ కుంటుంబసభ్యులు ఆరోపించారు. తహసీల్దార్‌, సబ్‌ కలెక్టర్లకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా... సమస్య తీరట్లేదని ఆవేదన చెందాడు. రైతులకు న్యాయం చేసే సీఎంకి ఎలాగైనా తమ ఆవేదన తెలియపర్చాలని తన పేజీలో పోస్టు పెట్టానని శరత్​ తెలిపాడు.

గంటల్లోనే సమస్య పరిష్కారం...

ఫోన్​ చేసిన గంటలోనే శరత్​ ఇంటికి మంచిర్యాల కలెక్టర్‌ హోళికేరి అధికారులతో కలిసి వచ్చారు. సమస్యపై విచారణ జరిపారు. వెంటనే పరిష్కరించటమే కాకుండా ఇప్పటివరకూ రాని రైతుబంధు పథకం డబ్బులు కూడా ఇప్పించారు. దీనంతటికీ కారణమైన వీఆర్వోను కూడా అధికారులు సస్పెండ్​ చేశారు.

యువకులకు సీఎం పిలుపు...

సమస్య తీరగానే చల్లబడకుండా రాష్ట్రంలోని తనబోటి యువకులను చైతన్యపరచాలని సీఎం శరత్​కు సూచించారు. ప్రభుత్వం రైతులకు మంచి చేసే పనులు చేసినప్పుడు బాసటగా నిలవాలని పిలుపునివ్వటం యువకుల్లో ఉత్సాహం నింపింది.

ఇవీ చూడండి:శరత్​... నేను కేసీఆర్​ను మాట్లాడుతున్నా...!

Last Updated : Mar 27, 2019, 8:38 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details