తెలంగాణ

telangana

ETV Bharat / state

ఖమ్మం బీకే బజార్​లో పర్యటించిన మంత్రి పువ్వాడ

ఖమ్మం జిల్లా కేంద్రంలోని బీకే బజార్​లో కరోనా పాజిటివ్ కేసు నమోదైనందున రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పర్యటించారు. అనంతరం మంత్రి ఇంటింటికి తిరుగుతూ కిరాణా సామగ్రి అందించారు.

By

Published : Apr 21, 2020, 7:55 PM IST

కట్టుదిట్టంగా నియంత్రణ చర్యలు చేపట్టాలి : మంత్రి పువ్వాడ
కట్టుదిట్టంగా నియంత్రణ చర్యలు చేపట్టాలి : మంత్రి పువ్వాడ

ఖమ్మంలో కరోనా పాజిటివ్ నమోదైన బీకే బజార్​లో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పర్యటించారు. తాజాగా ఎనిమిదో కేసు నమోదు కావడం వల్ల ఈ ప్రాంతమంతా కంటైన్మెంట్ జోన్​గా ప్రకటించారు. మంత్రి ఇంటింటికి తిరుగుతూ నిత్యావసర సరకులు అందజేశారు.

14 రోజుల వరకు ఎవరు బయటకు రావద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు. కట్టుదిట్టంగా నివారణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. స్థానికులతో కరోనా పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంత్రి చర్చించారు. మంత్రి వెంట కలెక్టర్ ఆర్​వి కర్ణన్, పురపాలిక కమిషనర్ అనురాగ్ జయంతి తదితరులు ఉన్నారు.

ఇవీ చూడండి : 'అలా బయటకు వచ్చేవారిపై... కేసులు పెడతాం'

ABOUT THE AUTHOR

...view details