సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆమరణ నిరహార దీక్షను భగ్నం చేసినందుకు నిరసనగా ఖమ్మంలో కాంగ్రెస్ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ఖమ్మం డీసీసీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ఈ కార్యక్రమం చేపట్టారు. అనంతరం పాలనాధికారి కార్యాలయంలోకి చొచ్చుకువెళ్లేందుకు విఫలయత్నం చేశారు. పోలీసులు అడ్డుకోవటం వల్ల గేటు ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముఖ్య నాయకులకు లోనికి వెళ్లేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నారని నాయకులు విమర్శించారు.
'ఖమ్మం డీసీసీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ' - HUNGER STRIKE
ప్రతిపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క ఆమరణ నిరహార దీక్షను అడ్డుకున్నందుకు ఖమ్మం డీసీసీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. .

ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేసిన డీసీసీ నాయకులు
Last Updated : Jun 11, 2019, 9:59 PM IST