తెలంగాణ

telangana

ETV Bharat / state

'కార్మిక చట్ట సవరణ బిల్లు ఉపసంహరించుకోవాలి'

కేంద్రం ప్రవేశపెట్టిన కార్మిక చట్ట సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని కరీంనగర్​ కలెక్టరేట్​ ముందు కార్మిక సంఘాలు ధర్నాకు దిగాయి. కార్మికవర్గం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను పెట్టుబడిదారుల కోసం  తాకట్టు పెడితే ఉరుకునేది లేదన్నారు.

By

Published : Aug 2, 2019, 8:50 PM IST

ధర్నా చేస్తున్న కార్మికులు

వర్షాన్ని లెక్కచేయకుండా కార్మికులు, జర్నలిస్టులు కరీంనగర్ కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టారు. కేంద్రం లోక్​సభలో ప్రవేశపెట్టిన కార్మిక చట్ట సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్​ చేశారు. కార్మికులను కట్టుబానిసలుగా మార్చే ఈ బిల్లు ఒప్పుకునేది లేదని తేల్చి చెప్పారు. కేంద్ర సంస్థలలో పనిచేస్తోన్న కార్మికులకు కనీస వేతనాలు జీవో ప్రకారం రోజుకు రూ.580 ఉండగా... అట్టడుగు కార్మికులకు కేంద్రప్రభుత్వం జాతీయ కనీస వేతనం రోజుకి రూ.178 లుగా నిర్ణయించడం అన్యాయమన్నారు.

కార్మిక చట్ట సవరణ బిల్లు ఉపసంహరించుకోవాలి

ABOUT THE AUTHOR

...view details