తెలంగాణ

telangana

ETV Bharat / state

కమీషన్ కోసం కోట్లు గల్లంతు చేసిన బ్యాంక్ మేనేజర్

పేరుకి బ్యాంక్​ మేనేజర్...ప్రజల సొమ్మును సొంత డబ్బులా వాడుకున్నాడు. కమీషన్​ కోసం కోట్ల రూపాయలు బయట వ్యక్తులకు చేబదులుగా ఇచ్చాడు. ఈ నెల జరిగిన ఆడిట్​లో అతని బాగోతం బయటపడింది.

By

Published : Mar 15, 2019, 8:39 AM IST

Updated : Mar 15, 2019, 8:51 AM IST

పెద్దమొత్తంలో సొమ్ము కాజేసిన మేనేజర్

పెద్దమొత్తంలో సొమ్ము కాజేసిన మేనేజర్
కరీంనగర్​లోని యూనియన్​ బ్యాంకులో భారీగా నగదు గల్లంతైంది. బ్యాంక్​ మేనేజర్​ సురేష్​ కుమార్ దాదాపు 12 కోట్ల రూపాయలు బయట వ్యక్తులుకు చేబదులుగా ఇచ్చాడు. రాజీవ్​ చౌక్​లోని చెస్ట్​ బ్యాంకుకు 27 శాఖలనుంచి నగదును తరలిస్తుంటారు. ఈ వ్యవహారమంతా బ్యాంక్​ మేనేజర్ అధీనంలో ఉంటుంది. దీనినే అదునుగా తీసుకున్న సురేష్ కమీషన్ కోసం రూ.12 కోట్లు ముంబైకు చెందిన ఫైనాన్స్​ వ్యాపారులకు ఇచ్చాడు.పట్టుబడిందిలా...
ఈనెల 11న జరిగిన ఆడిట్​లో ఈ వ్యవహారం అంతా బయటపడింది. పోలీసులు ప్రాథమిక విచారణ జరిపి... పెద్దమొత్తంలో నగదు లేకపోవడం వల్ల ఈ వ్యవహారం సీబీఐ పరిధిలోకి వస్తుందని తేల్చారు.
Last Updated : Mar 15, 2019, 8:51 AM IST

ABOUT THE AUTHOR

...view details