తెలంగాణ

telangana

ETV Bharat / state

కిడ్నీ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

దేశంలో కిడ్నీ వ్యాధుల వల్ల ఏటా ఎంతో మంది మరణిస్తున్నారు. సరైన నియమాలు పాటిస్తే వాటిని దూరం చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇవాళ ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్​ పీపుల్స్​ప్లాజాలో 2కె వాక్​ను నిర్వహించారు. ఈ నడకలో యువకులు, పిల్లలు, పెద్దలు అంతా ఉత్సాహంగా పాల్గొన్నారు.

By

Published : Mar 14, 2019, 11:10 AM IST

కిడ్నీ వ్యాధులు

పరుగులో పాల్గొంటున్న విద్యార్థులు, మహిళలు
ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్​ నెక్లెస్​ రోడ్​లోని పీపుల్స్​ ప్లాజాలో 2కె వాక్​​ నిర్వహించారు. కేర్​ ఆస్పత్రి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ప్రముఖ వైద్యులు, ఆరోగ్య నిపుణులు హాజరయ్యారు. చిన్నపిల్లలు, మహిళలు, యువకులు అంతా నడకలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రతి ఏటా కిడ్నీ రోగాల బారిన పడిన వారి సంఖ్య పెరుగుతుందని వైద్యులు తెలిపారు. శరీరంలో మూత్రపిండాలు అత్యంత కీలకమని అన్నారు. రోజూ వ్యాయామాన్ని అలవాటు చేసుకోవడం వల్ల అనారోగ్యం దరి చేరదని జీవన్​దాన్​ ఇన్​ఛార్జి డా.స్వర్ణలత పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details