సికింద్రాబాద్ పరిధిలోని మెట్టుగూడ వీధుల్లో రాత్రి పూట తిరగాలంటే భయపడిపోతున్నారు స్థానిక ప్రజలు. మెట్టుగూడ ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ప్రతిరోజు మద్యం సేవించి వీధుల్లో తిరుగుతూ స్థానికులను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాలనీ వాసుల ఫిర్యాదు మేరకు ఈ రోజు తనిఖీలు నిర్వహించగా పోలీసులతోనే వాగ్వాదానికి దిగారు మహానంద, స్టాలిన్లు. ఈ ఇద్దరు మందుబాబుల్ని పోలీసులు అరెస్టే చేశారు. 16 రోజుల రిమాండ్ విధించారు. పూటుగా తాగి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
మద్యం మత్తులో ప్రజలను ఇబ్బంది పెడ్తున్న ఇద్దరి అరెస్ట్ - DRINKERS
రాత్రైందంటే చాలు పూటుగా తాగడం. వీధుల్లో తిరుగుతూ వచ్చి పోయే వాళ్లని ఇబ్బంది పెట్టడం. ఏదో ఒకరోజు జరిగే కథ కాదిది. ప్రతిరోజు ఇలాగే చేస్తుంటారు. మందుబాబుల పోరు పడలేక స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మద్యం మత్తులో ప్రజలను ఇబ్బంది పెడ్తున్న ఇద్దరి అరెస్ట్
మద్యం మత్తులో ప్రజలను ఇబ్బంది పెడ్తున్న ఇద్దరి అరెస్ట్
ఇవీ చూడండి: కొండగట్టులో ముగిసిన హనుమాన్ జయంతి ఉత్సవాలు
Last Updated : May 30, 2019, 7:52 AM IST