హైదరాబాద్‌లోని లంగర్‌హౌజ్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న స్నూకర్ పార్లర్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. కరోనా నిబంధనలు ఉల్లంఘించి నిర్వహిస్తున్న స్నూకర్ పార్లర్‌పై పక్కా సమాచారంతో పోలీసులు దాడులు జరిపారు. దాడి చేసిన సమయంలో ఆటలో పాల్గొన్న 25 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.2వేలు స్వాధీనం చేసుకొని లంగర్‌హౌజ్ పోలీసులకు అప్పగించారు. కరోనా సమయంలో కొవిడ్-19 నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
స్నూకర్ పార్లర్‌పై పోలీసుల దాడి.. 25 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు!
నగరంలో కొవిడ్ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న స్నూకర్ పార్లర్‌పై వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. కరోనా నిబంధనలు ఉల్లంఘించి స్నూకర్ పార్లర్ నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో దాడి చేసి స్నూకర్ ఆడుతున్న 25 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు.
స్నూకర్ పార్లర్‌పై పోలీసుల దాడి.. అదుపులో 25 మంది!