తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉద్యోగాలిప్పిస్తానని మోసం చేసిన వ్యక్తి అరెస్టు

కృష్ణా జిల్లా గోపవరానికి చెందిన గరికపాటి సురేష్ ఇంజినీరింగ్​ పూర్తి చేశాడు. అనంతరం ఓ శాసనసభ్యుని వద్ద పీఏగా చేరాడు. ప్రభుత్వ పథకాలపై అవగాహన పెంచుకున్న సురేష్​ సచివాలయంలో ఉద్యోగాలిప్పిస్తానని నిరుద్యోగుల నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేశాడు. నమ్మి డబ్బు చెల్లించిన వారు తిరిగి అడిగితే వారిపై బెదిరింపులకు పాల్పడేవాడు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన టాస్క్​ఫోర్స్​ పోలీసులు నిందితుడిని కటాకటాల్లోకి నెట్టారు.

By

Published : Aug 28, 2019, 11:44 PM IST

మోసగాడి అరెస్టు

ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురి నిరుద్యోగుల నుంచి లక్షలు వసూలు చేసిన ఓ కేటుగాడిని టాస్క్​ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. కృష్ణా జిల్లా గోపవరానికి చెందిన గరికపాటి సురేష్​ ఇంజినీరింగ్​ పూర్తి చేశాడు. ఆ తర్వాత ఓ శాసనసభ్యుని వద్ద పీఏగా చేరాడు. సచివాలయంలో పరిచయాలు పెంచుకుని తిరుపతి దేవస్థానం టికెట్లు, రైల్వే టికెట్లు ఇప్పిస్తానంటూ పలువురి వద్ద కమిషన్లు గుంజేవాడు. విలాసవంతమైన జీవితం గడుపుతూ... చెడు అలవాట్లకు బానిస అయ్యాడు. ప్రభుత్వ పథకాలపై అవగాహన పెంచుకున్న సురేష్... కాంట్రాక్ట్​లు, పథకాలపై డబ్బులు వచ్చేలా చేస్తాను అంటూ అమాయకుల నుంచి లక్షల్లో డబ్బు గుంజాడు. సచివాలయంలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఇప్పటివరకూ 40 మందిని మోసం చేశాడు. ఇతన్ని నమ్మి డబ్బులు చెల్లించిన నిరుద్యోగులు తిరిగి అడిగితే బెదిరింపులకు పాల్పడేవాడు. బాధితుల ఫిర్యాదుతో నిందితుడిని అదుపులోకి తీసుకున్న టాస్క్​ఫోర్స్ పోలీసులు సైఫాబాద్ పోలీసులకు అప్పగించారు. ఇతడిపై పలు పోలీస్​స్టేషన్లలో కేసులున్నట్లు గుర్తించిన పోలీసులు రిమాండ్​కు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details