తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉన్మాదికి ఉరిశిక్ష వేయాలంటూ రిలే దీక్ష

తొమ్మిది నెలల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా  శిక్షించాలంటూ  ప్రజాసంఘాలు డిమాండ్​ చేస్తున్నాయి. నిందితుడికి ఉరిశిక్ష వేయాలంటూ ఇందిరాపార్కు ధర్నాచౌక్​ వద్ద నాయి బ్రాహ్మణుల సంఘ సభ్యులు రిలే నిరాహార దీక్ష చేశారు.

By

Published : Jun 23, 2019, 12:37 PM IST

ఉన్మాదికి ఉరిశిక్ష వేయాలంటూ రిలే నిరాహర దీక్ష

చిన్నారులపై ఆంగంతుకుల అకృత్యాలు అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చట్టాలు అమలు చేయాలని ప్రజాసంఘాలు డిమాండ్​ చేస్తున్నాయి. హన్మకొండలో తొమ్మిది నెలల చిన్నారిని చిదిమేసిన దుర్మార్గుడికి ఉరిశిక్ష వేయాలంటూ నాయి బ్రాహ్మణ సంఘం సభ్యులు ఇందిరాపార్కు వద్ద ధర్నచౌక్​లో ఒకరోజు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. రాష్ట్రంలోని మహిళలకు, బాలికలకు రక్షణ కరవైందని నాయి బ్రాహ్మణ సేవా సంఘం నాయకులు ఆరోపించారు. మహిళలపై అఘయిత్యానికి పాల్పడితే కఠినంగా శిక్షించాలని కోరారు.

ఉన్మాదికి ఉరిశిక్ష వేయాలంటూ రిలే నిరాహర దీక్ష

ABOUT THE AUTHOR

...view details