తెలంగాణ

telangana

ETV Bharat / state

"బీసీ సమస్యల పరిష్కారానికై కృషి చేస్తా.."

హైదరాబాద్​ ప్రెస్​క్లబ్​లో జాతీయ బీసీ కమిషన్​ సభ్యుడు ఆచారికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. బీసీల సమస్యలు పరిష్కరించడానికి తనవంతు కృషి చేస్తానని ఆచారి తెలిపారు.

By

Published : Jun 18, 2019, 12:02 PM IST

Updated : Jun 18, 2019, 3:05 PM IST

బీసీ సమస్యల పరిష్కారానికై కృషి చేస్తా

రాష్ట్రంలో బీసీలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు పెండింగ్​లో ఉన్నాయని... వాటిని పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానని జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు ఆచారి అన్నారు. హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్​లో మెట్రోవాటర్ వర్క్స్ అండ్ సెవరేజ్ బోర్డు బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆచారికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షుడు ఆర్. కృష్ణయ్యతో పాటు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పాతికేళ్ల క్రితమే జాతీయ బీసీ కమిషన్​ను ఏర్పాటు చేసినప్పటికీ అప్పటి ప్రభుత్వం రాజ్యాంగ బద్దమైన హక్కులు కల్పించలేదని ఆచారి ఆరోపించారు. దేశంలో అధికంగా ఉన్న వెనకబడ్డ కులాలకు న్యాయం చేయడానికి... వారి హక్కులను కాపాడటానికే ప్రధాని మోదీ జాతీయ బీసీ కమిషన్​ను ఏర్పాటు చేశారని తెలిపారు. బీసీలపై అనేక దాడులు జరుగుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వాటిని నివారించడంలో పూర్తిగా విఫలమైందని ఆచారి విమర్శించారు.

బీసీ సమస్యల పరిష్కారానికై కృషి చేస్తా
Last Updated : Jun 18, 2019, 3:05 PM IST

ABOUT THE AUTHOR

...view details