తెలంగాణ

telangana

ETV Bharat / state

ధ్యానం చేయండి ఒత్తిడిని తగ్గించుకోండి

హైదరాబాద్​లోని నెక్లెస్​రోడ్డులో ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇండియా ఫిజియోథెరపీ, మెడికల్ అసోసియేషన్ ఉమెన్ వింగ్​ల ఆధ్వర్యంలో 2కే రన్​ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరయి జెండా ఊపి పరుగు ప్రారంభించారు.

By

Published : Sep 8, 2019, 5:33 PM IST

ధ్యానం చేయండి ఒత్తిడిని తగ్గించుకోండి

ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇండియన్ ఫిజియోథెరపీ సొసైటీ , ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఉమెన్ వింగ్ ఎయిర్ పోర్ట్​ల ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పించడం కోసం హైదరాబాద్​లోని నెక్లెస్​రోడ్డులో 2కె రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇండియా మాజీ క్రికెటర్ వీవీఎస్​ లక్ష్మణ్​ ముఖ్య అతిథిగా హాజరయి జెండా ఊపి రన్​ను ప్రారంభించారు. పీపుల్స్ ప్లాజా నుంచి జలవిహార్ వరకు కొనసాగిన పరుగులో వైద్యులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారికి అవగాహన పెంచేందుకు ప్రయత్నిస్తున్న సంస్థ నిర్వాహకులను లక్ష్మణ్ అభినందించారు. ఏదైనా సమస్యను ఇతరులతో పంచుకోవాలే కానీ.. చావడం పరిష్కారం కాదని డా.హరికుమార్ అన్నారు. ధ్యానం చేయడం ద్వారా ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుందని వివరించారు.

ధ్యానం చేయండి ఒత్తిడిని తగ్గించుకోండి

ABOUT THE AUTHOR

...view details