తెలంగాణ

telangana

ETV Bharat / state

నాణ్యతలో రాజీ లేదు

నగరంలో మెరుగైన రోడ్ల నిర్వాహణ, మరమ్మతులపై జీహెచ్​ఎంసీ కమిషనర్​ దానకిషోర్​ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

By

Published : Mar 8, 2019, 5:24 AM IST

Updated : Mar 8, 2019, 11:57 AM IST

జీహెచ్​ఎంసీ సమీక్ష సమావేశం

రోడ్డు పనులన్నీ సత్వరమే పూర్తిచేయాలి
న‌గ‌రంలో మెరుగైన రోడ్ల నిర్వహ‌ణ‌, మ‌ర‌మ్మతుల‌పై జీహెచ్ఎంసీ నిర్వాహ‌ణ విభాగం, జ‌ల‌మండ‌లి ఇంజినీర్లతో జీహెచ్​ఎంసీ కమిషనర్​ సమీక్ష నిర్వహించారు. జలమండలి కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో రహదారుల అభివృద్ధిలో భాగంగా చేప‌ట్టిన మ్యాన్‌హోల్, క్యాచ్‌పిట్‌లను త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులను దానకిషోర్ ఆదేశించారు. వీటి మ‌ర‌మ్మతుల సంద‌ర్భంగా ప్రయాణికుల‌కు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చ‌ర్యలు తీసుకోవాలన్నారు. పనులన్నింటికీ నిధులు మంజూరు చేశామని, నాణ్యత విషయంలో రాజీపడేది లేదని స్పష్టం చేశారు.

పర్యటక మార్గాలపై ప్రత్యేక దృష్టి...

ప‌ర్యట‌కుల‌ను ఆక‌ర్షించేందుకు చార్మినార్‌, గోల్కొండ‌ త‌దిత‌ర చారిత్రక క‌ట్టడాలకు వెళ్లే మార్గాల్లోని రోడ్ల నిర్వహ‌ణ‌పై క‌మిష‌న‌ర్ ప్రత్యేకంగా చర్చించారు. స‌మావేశంలో జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజినీర్ జియాఉద్దీన్‌, జ‌ల‌మండ‌లి నిర్వాహ‌ణ విభాగం డైరెక్ట‌ర్, ఇంజినీర్లు పాల్గొన్నారు.

ఇవీ చదవండి:రాష్ట్రంలో సిద్దిపేట బేష్​

Last Updated : Mar 8, 2019, 11:57 AM IST

ABOUT THE AUTHOR

...view details