తెలంగాణ

telangana

ETV Bharat / state

టెండర్లు రద్దు కోరుతూ గంగపుత్ర చైతన్య సమితి వినతి పత్రం

మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేప పిల్లల టెండర్లను నిర్వహించే పద్ధతిని ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని కోరుతూ గంగపుత్ర చైతన్య సమితి మత్స్య శాఖ కమిషనర్ కార్యాలయంలో వినతి పత్రం అందించింది. ఏటా మత్స్యకారులకు ఉచిత చేప పిల్లలకు కోట్లాది రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేస్తోందని... ఆ నిధులు లబ్ధిదారులకు చేరడం లేదని సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.

By

Published : Jun 20, 2020, 7:39 PM IST

Gangaputra Unions Demand For Fish Tender Cancellation
టెండర్లు రద్దు చేయాలని కోరుతూ వినతి పత్రం అందించిన గంగపుత్ర చైతన్య సమితి

రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మత్స్యశాఖ నిర్వహిస్తున్న చేప పిల్లల టెండర్ల పద్ధతిని వెంటనే రద్దు చేయాలని కోరుతూ మత్స్య శాఖ కమిషనర్​కు గంగపుత్ర చైతన్స సమితి వినతి పత్రం సమర్పించింది. ప్రభుత్వమే మత్స్యకారులకు చేపపిల్లలు అందించేందుకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని.. ఆ నిధులు మాత్రం లబ్ధిదారులకు చేరడం లేదని గంగపుత్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఒక వైపు గ్రామాల్లో.. గ్రామాభివృద్ది కమిటీలు తాము చెప్పిన ధరలకే చేపలు అమ్మాలని గంగపుత్రులపై ఒత్తిడి తెస్తున్నాయని సంఘం అధ్యక్షుడు పూస సత్యనారాయణ బెస్త మండిపడ్డారు. చెరువులు, చేపల మీద తమకే పూర్తి హక్కులున్నాయని..అలాంటప్పుడు గ్రామ కమిటీకి ఎందుకు డబ్బులు చెల్లించాలని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దళారీ వ్యవస్థను రద్దు చేసి సొసైటీల ఖాతాల్లోనే నిధులు జమ చేయాలని దీక్ష చేపట్టిన తెలంగాణ మత్స్యకారులు , మత్స్యకార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ బెస్త అరెస్టును ఖండిస్తున్నామని సత్యం తెలిపారు.


టీఎంకేఎంకేఎస్ ఉపాధ్యక్షుడు ముఠా విజయ్ కుమార్ బెస్త , తెలంగాణ మత్స్యకార రాష్ట్ర అధ్యక్షుడు గూడబోయిన సాయిలు బెస్త , గంగపుత్ర ఐక్యవేదిక అధ్యక్షుడు రణవేని లక్ష్మణ్ బెస్తను పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని... ఇందుకు ప్రభుత్వమే జవాబు చెప్పాలని డిమాండ్​ చేశారు. ప్రభుత్వం నిరంకుశ పోకడలకు పోయి.. కాంట్రాక్టర్ల లబ్ధి కోసం కాకుండా మత్స్యకారులకు మేలు జరిగేలా చేయాలని, టెండర్లను వెంటనే రద్దు చేయాలన్నారు. సంప్రదాయ మత్స్యకారులు.. గంగపుత్రులేనని.. తమను లంచం పేరిట ఏ గ్రామ కమిటీలు వేధించినా తీవ్ర పరిణామాలు ఉంటాయని సత్యం హెచ్చరించారు. నిధులను మత్స్య సహకార సంఘాలకే బదిలీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. తాము చెరువుల్లో చేపలు సాగు చేస్తున్న తరుణంలో పలు గ్రామాల్లో గ్రామ కమిటీ పేరిట చేపల లూటీకి పాల్పడడం, చేపల వేటను అడ్డుకుంటే తమపై భౌతిక దాడులు చేయడాన్ని అధికార ప్రతినిధి సురేష్ బెస్త ఖండించారు. కార్యక్రమంలో పూస శ్రీనివాస్ బెస్త, చింతకింది రవి బెస్త, బెస్త నర్సింగ్ పాల్గొన్నారు.

ఇవీ చూడండి: హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఈటల

ABOUT THE AUTHOR

...view details