కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక రంగ చట్టాలను కార్పోరేట్ రంగానికి అనుగుణంగా మార్చడానికి అనేక మార్గాలు ఆలోచిస్తోందని శాసనమండలి మాజీ సభ్యులు చుక్కారామయ్య ఆరోపించారు. ఏఐఎఫ్టీయు 28 వార్షికోత్సవం పురస్కరించుకుని ఆగస్టు 11న జరిగే ఎస్టీయూ రాష్ట్ర మహాసభల కరపత్రాన్ని హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలో ఏఐఎఫ్టీయూ ప్రతినిధులు విమలక్క తదితరులు ఆవిష్కరించారు. కేంద్రం పారిశ్రామిక రంగాన్ని నిర్వీర్యం చేయడానికి చట్టాలను మార్పు చేస్తోందని చుక్కరామయ్య ఆరోపించారు. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం ఏఐఎఫ్టీయూ చేస్తున్న కృషిని కొనియాడారు. ఆయా హక్కుల కోసం రాజీలేని పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
చట్టాలను నిర్వీర్యం చేసేందుకు కుట్ర - mlc
ఆగస్టు 11న జరిగే ఎస్టీయూ రాష్ట్ర మహాసభల కరపత్రాన్ని హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలో ఏఐఎఫ్టీయూ ప్రతినిధులు విమలక్క తదితరులు ఆవిష్కరించారు.

చుక్కారామయ్య