తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆదివాసీల హక్కులు అమలు చేయండి'

రాష్ట్రంలో అడవులను కాపాడటం, పర్యావరణాన్ని రక్షించడం, ఆదివాసీల హక్కులను అమలుకోసం పోరాడటమే చేయడం మా లక్ష్యమని అఖిల భారత ఆదివాసీ కాంగ్రెస్‌ వైస్‌ ఛైర్మన్‌ బెల్లయ్యనాయక్‌ తెలిపారు. ఆదివాసీలపై జరుగుతన్న దాడులను ఆయన ఖండించారు.

By

Published : Jul 15, 2019, 11:35 PM IST

ఆదివాసుల హక్కులు అమలు చేయండి@బెల్లయ్య

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక... ఎన్నిఎకరాలు ఆదివాసీలకు పంపిణీ చేశారో... ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీలో వెల్లడించాలని అఖిల భారత ఆదివాసీ కాంగ్రెస్‌ వైస్‌ ఛైర్మన్‌ బెల్లయ్యనాయక్‌ డిమాండ్‌ చేశారు. ఇటీవల కాలంలో ఆదివాసీలపై దాడులు జరగడాన్ని ఖండించిన ఆయన... 2006లో ఆదివాసీలకు అండగా అటవీహక్కుల చట్టాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం తెచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.

పది సంవత్సరాలుగా సాగు చేసిన ఆదివాసీలకు అప్పట్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం మూడు లక్షల ఎకరాలకు పట్టాలు ఇచ్చిందన్నారు. ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీలను దొంగలుగా, అడవులను విధ్వంసం చేసే వాళ్లుగా చిత్రీకరిస్తోందని ఆరోపించారు. రెండు వేల ఎకరాలను ఆక్రమించిన భద్రాచలం పేపర్‌ బోర్డుపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. అటవీ హక్కులను కఠినంగా అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 18, 19 తేదీల్లో ఇందిరా పార్కు వద్ద దీక్ష చేస్తామని ఆయన ప్రకటించారు.

'ఆదివాసీల హక్కులు అమలు చేయండి'

ఇదీ చూడండి : అమ్మాయిల సాహసయాత్రపై పుస్తకావిష్కరణ

ABOUT THE AUTHOR

...view details