తెలంగాణ

telangana

ETV Bharat / state

'యూరియా కోసం రైతులు ఆందోళన చెందొద్దు '

రాష్ట్రంలో వ్యవసాయ అవసరాలకు యూరియా కొరత రాకుండా సర్కారు చర్యలు తీసుకుంటోంది. ఈ ఖరీఫ్ సీజన్​కు సంబంధించి 8.50 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేంద్రం కేటాయించిందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​ రెడ్డి తెలిపారు.  రాష్ట్రంలో సాగు పరిమాణం పెరుగుతున్నందున యూరియా అవసరం దృష్టిలో పెట్టుకుని కేంద్రానికి లేఖ రాసినట్లు మంత్రి పేర్కొన్నారు.

By

Published : Aug 23, 2019, 6:55 PM IST

యూరియా కోసం రైతులు ఆందోళన చెందొద్దు

రాష్ట్రంలో పెరుగుతున్న వ్యవసాయ పరిమాణం దృష్టిలో ఉంచుకొని యూరియా కోసం కేంద్రానికి లేఖ రాసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్​ రెడ్డి తెలిపారు. పలు జిల్లాల్లో యూరియా కొరత నేపథ్యంలో వ్యవసాయ శాఖ మంత్రి స్పందించారు. ఖరీఫ్​ సీజన్​ కోసం 8.50 లక్షల మెట్రిక్​ టన్నుల యూరియాను కేంద్రం కేటాయించగా 3.97 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం 2.12 లక్షల మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉందన్నారు. రసాయన ఎరువుల కేటాయింపు అనేది కేంద్రం పరిధిలో ఉన్నందున ఏటా ఆయా రాష్ట్రాల వాడకాన్ని బట్టి కొంత కోటా పెంచడం జరుగుతోందని పేర్కొన్నారు. ఈ పరిస్థితి ముందే ఊహించి ఈ నెల 19న కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌కు తెలంగాణ ప్రభుత్వం తరపున లేఖ రాశామని తెలిపారు. కేంద్రం వెంటనే స్పందించి తెలంగాణకు కేటాయించిన యూరియా కోటా విడుదల చేయాలని విజ్ఞప్తి చేసిన దృష్ట్యా రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి పేర్కొన్నారు.

యూరియా కోసం రైతులు ఆందోళన చెందొద్దు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details