తెలంగాణ

telangana

ETV Bharat / state

'పరిమితికి మించి మూల్యాంకనం చేయించారు'​

ఇంటర్​ విద్యార్థుల ఆత్మహత్యలు, తాజాగా నెలకొన్న వివాదంపై తెలంగాణ లెక్చరర్స్​ ఫోరం స్పందించింది. పరిమితికి మించి అధ్యాపకులతో పేపర్లను మూల్యాంకనం చేయించడం వల్లే తీవ్ర ఒత్తిడితో ఈ ఫలితం వచ్చినట్లు వారు పేర్కొన్నారు.

By

Published : Apr 26, 2019, 8:31 AM IST

'పరిమితికి మించి మూల్యాంకనం చేయించారు'​

'పరిమితికి మించి మూల్యాంకనం చేయించారు'​
పరిమితికి మించి అధ్యాపకులతో పేపర్ మూల్యాంకనం చేయించడం వల్లే అనార్థాలు చోటు చేసుకున్నాయని తెలంగాణ లెక్చరర్స్ ఫోరమ్ ఆరోపించింది. అతి తక్కువ సమయంలో అధికంగా పేపర్లు మూల్యాంకనం చేయడం వల్ల అధ్యాపకులపై ఒత్తిడి పెరిగిందన్నారు.

దాదాపు 22 మంది ప్రాణాలు కోల్పోయాక దిద్దుబాటు చర్యలు తీసుకుంటే ఉపయోగం ఉండదని ఫోరం ప్రతినిధులు అన్నారు. తెరాస అధికారంలోకి వచ్చాక ఈ ఐదేళ్లలో విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పు ఏంటో చెప్పాలంటూ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఇంటర్మీడియట్ బోర్డులో 5 వేల ఉద్యోగాలు ఖాళీ ఉన్నా వాటిని భర్తీ చేయకుండా బయటి వాళ్ళకు కాంట్రాక్టు ఇవ్వడం వల్లనే వారు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించి పిల్లల జీవితాలతో ఆడుకున్నారని ఫోరమ్ అధ్యక్షుడు మురళీ మనోహర్ ఆరోపించారు. ఇంటర్​ విద్యార్థుల ఆత్మహత్యలపై ఎవరు బాధ్యత వహిస్తారని ఆయన ప్రశ్నించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details