తెలంగాణ

telangana

ETV Bharat / state

నీటి వృథాపై అవగాహనకు జలమండలి సన్నద్ధం

నీటి వృథాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు హైదరాబాద్​ జలమండలి సిద్ధమవుతోంది. కలుషిత నీరు సరఫరా కాకుండా ఉండేందుకు చేపట్టాల్సిన చర్యలపై మేనేజర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి, నివేదిక ఇవ్వాలని సూచించారు.

By

Published : Jun 2, 2019, 12:03 AM IST

నీటి వృథాపై జలమండలి అవగాహన

హైదరాబాద్​లో నీటి వృథాపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జలమండలి ఎండీ దానకిషోర్ సూచించారు. ఖైర‌తాబాద్‌ జ‌ల‌మండ‌లి ప్రధాన కార్యాల‌యంలో జ‌ల‌మండ‌లి, జీహెచ్ఎంసీ అధికారులతో స‌మీక్ష నిర్వహించారు. నగరంలో నీటిని అధికంగా వృథా చేసే 150 ప్రాంతాల‌ను గుర్తించి... ఒక్కో వార్డులో 2వేల 500 ఇళ్లు చొప్పున న‌గ‌ర‌ వ్యాప్తంగా 4 ల‌క్షల ఇళ్లకు వెళ్లి పొదుపుపై వివరించాలన్నారు. ఎన్​జీవోస్, సాఫ్ హైద‌రాబాద్-షాన్‌దార్ హైద‌రాబాద్‌ స‌భ్యులు, వాక్ వాలంటీర్లతో క‌లిసి అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని ఆదేశించారు. అలాగే క‌లుషిత నీరు స‌ర‌ఫ‌రా కాకుండా ఉండేందుకు చేపట్టాల్సిన చ‌ర్యల‌పై మేనేజ‌ర్లు క్షేత్రస్థాయిలో ప‌ర్యటించి, నివేదిక అందించాల‌ని సూచించారు. జలమండలి ఆధ్వర్యంలో 79 కిలోమీటర్ల మేర ఈనెల 10లోపు రోడ్డు మ‌ర‌మ్మతు ప‌నుల‌ు పూర్తిచేయాలని అధికారుల‌ను ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details