తెలంగాణ

telangana

ETV Bharat / state

ఖాసీం భయ్యా న్యాయం జరిగేనా..?

విధులనే దైవంగా భావించారు. పోలీసు శాఖకు దశాబ్దాల పాటు సేవ చేశారు. మంచి పోలీసుగా పేరు తెచ్చుకున్నారు. కానీ దేవుడు అతన్ని చిన్న చూపు చూశాడు. ఓ ప్రమాదంలో గాయపడి నడవలేని స్థితికి చేరాడు. చేయూత నివ్వాలని ఏళ్లుగా పోలీస్ శాఖను వేడుకుంటూనే ఉన్నారు. అయినా వారు కనికరించలేదు. ఇప్పటికైనా తనను ఆదుకోవాలని దీనంగా కోరుతున్నారు భద్రాద్రి కొత్తగూడెం  జిల్లా పాల్వంచకు చెందిన షేక్​ ఖాసీం.

By

Published : Aug 17, 2019, 10:49 AM IST

Updated : Aug 17, 2019, 11:28 AM IST

కుమార్తెతో ఖాసీం

ఎవరికైనా అన్యాయం జరిగితే పోలీసుల్ని ఆశ్రయిస్తాం. ఆ పోలీసు శాఖే అన్యాయం చేస్తే ఎవరిని వేడుకోవాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన షేక్​ ఖాసీం. ఆయన 1980 నుంచి 1999 వరకు పోలీసు శాఖలో పని చేశారు. పాల్వంచ ఠాణాలో విధుల్లో ఉన్నప్పుడు రోడ్డు ప్రమాదానికి గురై అచేతన స్తితికి చేరుకున్నారు. తన స్థానంలో కుమారుడు యాకూబ్​కు హోంగార్డుగా అవకాశం ఇవ్వాలని కోరారు.

కుమారుడు మృతి

ఇంతలో ఖాసీం కుటుంబంపై పిడుగు పడింది. ఓ రోడ్డు ప్రమాదంలో కుమారుడు చనిపోగా భార్య మొగలాబికి నడుము విరిగిపోయింది. కుటుంబం మరింత దుర్భరమైన స్థితికి వెళ్లింది. ఇలాంటి సమయంలో కుమార్తె మీరాబీ తల్లిదండ్రులకు అండగా నిలిచింది. పెళ్లై అత్తగారింటికి వెళ్లిన అమ్మనాన్న దయనీయ పరిస్థితి చూసి పుట్టింటికి వచ్చింది. ఆమెకైనా కొలువిచ్చి ఆదుకోవాలని ఖాసీం వేడుకుంటున్నాడు.

నిరాశే మిగిలింది

పోలీస్​ పెద్దల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఫలితంలేక ఈసారి ముఖ్యమంత్రిని కలవాలని హైదరాబాద్​కు వచ్చారు. కానీ వారి ఆశ నిరాశే అయింది. నాలుగు రోజులుగా తెలంగాణ భవన్​ వద్ద, రెండు రోజులుగా డీజీపీ ఆఫీస్​ వద్ద పడిగాపులు కాసినా అతని ప్రయత్నాలు ఫలించలేదు. కేసీఆర్​, కేటీఆర్​ సార్​లను కలుద్దామని వచ్చామని...వారిని కలిసేందుకు వీలు కాలేదని కన్నీటిపర్యంతమయ్యారు. ఇప్పటికైనా... పోలీస్​ శాఖ వారు స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు.

ఖాసీం భయ్యా న్యాయం జరిగేనా..?

ఇదీ చూడండి: అనిశాకు చిక్కిన ఇద్దరు జీహెచ్‌ఎంసీ సిబ్బంది

Last Updated : Aug 17, 2019, 11:28 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details