తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆదిలాబాద్​ రైతులకు తీరని యూరియా కొరత

ఆదిలాబాద్​లో గత వారం రోజులుగా రైతులను యూరియా కొరత వెంటాడుతోంది. క్యూలైన్లలో గంటకుపైగా వేచి ఉండాల్సి వస్తుందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

By

Published : Sep 13, 2019, 8:19 PM IST

ఆదిలాబాద్​ రైతులకు తీరని యూరియా కొరత

ఆదిలాబాద్ జిల్లా రైతులను యూరియా కొరత వెంటాడుతోంది. గత వారం రోజులుగా యూరియా కోసం అన్నదాతలు పడిగాపులు పడుతున్నారు. ఇవాళ ఇద్దరు ప్రైవేటు డీలర్ల వద్ద యూరియా నిల్వ ఉందని తెలియడం వల్ల వారి దుకాణాల ముందు లైన్​ కట్టారు. ఒక్క వ్యక్తికి గంటకుపైగా నిలబడాల్సి వచ్చిందని బాధితులు వాపోయారు. యూరియా కొరత లేకున్నా బారులు తీరాల్సి వస్తుందని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆదిలాబాద్​ రైతులకు తీరని యూరియా కొరత

ABOUT THE AUTHOR

...view details