తెలంగాణ

telangana

ETV Bharat / state

పర్యటక క్షేత్రాల సందర్శనకు ప్రత్యేక ప్యాకేజీలు

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ప్రసిద్ధి చెందిన ఆలయాలతో పాటు, జలపాతాలు, ప్రాజెక్టులు, చారిత్రక, వారసత్వ సంపదను సందర్శించేందుకు ప్రత్యేక ప్యాకేజీలు ఏర్పాటు చేయాలని ప్రభత్వం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి.

By

Published : Jul 25, 2019, 12:30 PM IST

ఆదిలాబాద్‌ జిల్లా...పర్యాటక క్షేత్రాలు

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఉన్న పర్యటక ప్రాంతాలను సమూహంగా ఏర్పాటు చేసి ప్యాకేజీలు అమలు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నిర్మల్‌ జిల్లాలో వారసత్వ సంపదగా పురాతన కోటలు, నిమ్మనాయుడి పాలన నాటి గొలుసుల దర్వాజ, శ్యాంఘడ్‌, బత్తీస్‌ఘడ్‌ కోటలను చూడడానికి అవకాశం ఉంది. అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన కొయ్య బొమ్మలను తిలకించవచ్ఛు.

జోడేఘట్‌ పర్యటక ప్రాంతం
గిరిజనుల హక్కుల కోసం పోరాడిన కుమురం భీం ఆశయాలకు స్ఫూర్తిగా జోడేఘట్‌ను పర్యటక ప్రాంతంగా తీర్చిదిద్దుతున్నారు. ఉమ్మడి జిల్లా మొత్తంలో 48 ప్రాంతాలను పర్యటక ప్రాంతాలుగా గుర్తించినట్లు ఆ శాఖ అధికారి రవీందర్‌ తెలిపారు.

ఆధాత్మిక క్షేత్రాలు సైతం
ప్రధానంగా దేశంలో రెండే సరస్వతీ క్షేత్రాలు ఉన్నాయి. ఒకటి కశ్మీర్‌లో ఉండగా, రెండోది నిర్మల్‌ జిల్లా బాసరలో ఉంది. వేదవతి సీత, అష్టతీర్థ., బాసర చుట్టూ చూడదగ్గ ప్రదేశాలున్నాయి. అన్నవరం తరువాత తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన గూడెం గుట్టపై సత్యనారాయణ స్వామి ఆలయం ఉంది. జైనథ్‌ మండల కేంద్రంలో శ్రీలక్ష్మీనారాయణ స్వామి ఆలయం ఉంది. ఇచ్చోడ మండలం సిరిచెల్మలో చెరువు మధ్యన మల్లికార్జున స్వామి ఆలయం ఉంది. వీటితో పాటు గిరిజనుల ఆరాధ్యదైవం నాగోబా, దిలావర్‌పూర్‌ మండలంలో కదిలి పాపహారేశ్వర ఆలయం, బెల్లంపల్లిలో బుగ్గరాజరాజేశ్వర స్వామి, సారంగాపూర్‌లో అడెల్లిపోచమ్మ ఆలయం, చెన్నూర్‌లో అగస్తేశ్వరాలయం, వాంకిడిలోని శివాలయం, ఆసిఫాబాద్‌లోని బాలేశ్వరాలయం, సిర్పూరులోని వేంకటేశ్వర ఆలయం ఉంది. వీటన్నింటిని సందర్శించేందుకు వీలుగా కసరత్తు చేస్తున్నారు.

జలపాతాలు
అడవుల మధ్యన కొండలు, గుట్టలపై నుంచి జాలువారే జలపాతాలు అనేకం ఉన్నాయి. వీటిలో కొన్నింటికి రహదారి సౌకర్యం ఉండటంతో నేరుగా వాహనాలలో వెళ్లవచ్ఛు గాయత్రి, పొచ్చెర, సప్తగుండం, ఇలా అనేక జలపాతాలు జిల్లాలో ఉన్నాయి. జిల్లాలో పర్యటకులు సేదతీరేందుకు కడెం ప్రాజెక్టును ఆన్ని రకాలుగా తీర్చిదిద్దారు.

ఇదీ చూడండి : జీవో.8 రద్దుకు అంగన్​వాడీ టీచర్ల డిమాండ్

ABOUT THE AUTHOR

...view details