తెలంగాణ

telangana

ETV Bharat / sports

'వార్నర్​ ఔట్​.. అదే నా ఫేవరెట్ వికెట్'

హైదరాబాద్​ జట్టుతో జరిగిన మ్యాచ్​ సూపర్​ ఓవర్​లో ఉత్తమ బౌలింగ్​తో​ కోల్​కతాకు విజయాన్ని అందించాడు ఫెర్గూసన్.​ మొదటి బంతికే వార్నర్​ను ఔట్​ చేయడం ఈ గేమ్​లో తన ఫేవరెట్​ వికెట్​ అని తెలిపాడు.

By

Published : Oct 19, 2020, 5:20 AM IST

Ferguson_ Warner
'వార్నర్​ ఔట్​.. అదే నా ఫేవరెట్'

సూపర్​ ఓవర్​లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన కనబర్చి కోల్​కతా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు బౌలర్​ లాఖీ ఫెర్గూసన్. ఆదివారం సన్​రైజర్స్​తో జరిగిన ఈ మ్యాచ్ సూపర్​ ఓవర్​​లో ఫెర్గూసన్​ కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చి హైదరాబాద్ బ్యాట్స్​మెన్​ని కట్టడి చేశాడు.

" ఈ మ్యాచ్​లో నా ఫేవరెట్​ వికెట్​.. సూపర్​ ఓవర్​ మొదటి బంతిలోనే డెవిడ్​ వార్నర్​ను ఔట్ చేయడం".

- ఫెర్గూసన్, కోల్​కతా నైట్​ రైడర్స్ బౌలర్.

మోర్గాన్​ ఆధ్వర్యంలో ఆడడం ఆనందంగా ఉందని ఫెర్గూసన్​ తెలిపాడు. ఈ మ్యాచ్​ గెలవడం సంతోషాన్నించిందని వ్యాఖ్యానించాడు. బ్యాట్స్​మెన్​ కష్టానికి ప్రతిఫలంగా బౌలింగ్​లోనూ రాణించడం వల్లే ఈ గెలుపు సొంతమైందని అన్నాడు.

మ్యాచ్​ అనంతరం మాట్లాడిన కోల్​కతా కెప్టెన్​ మోర్గాన్.. ముందు జరిగిన మ్యాచ్​లో, సూపర్​ ఓవర్​లో ఫెర్గూసన్​ బౌలింగ్​పై ప్రశంసలు కురిపించాడు.

ఇదీ చదవండి:కోల్​కతా సూపర్ విజయం.. సన్​రైజర్స్​కు తప్పని ఓటమి

ABOUT THE AUTHOR

...view details