తెలంగాణ

telangana

ETV Bharat / sports

శ్రేయస్ హ్యాట్రిక్​.. రాజస్థాన్​ లక్ష్యం 63

చిన్నస్వామి స్టేడియం వేదికగా రాజస్థాన్​తో జరుగుతున్న మ్యాచ్​లో బెంగళూరు 5 ఓవర్లకు 62 పరుగులు చేసింది. శ్రేయస్ హ్యాట్రిక్ వికెట్లతో చక్కటి ప్రదర్శన చేశాడు. విరాట్ ఆరు బంతుల్లో 25 పరుగులు చేశాడు.

By

Published : May 1, 2019, 12:03 AM IST

Updated : May 1, 2019, 12:15 AM IST

ఆర్​సీబీ

రాజస్థాన్​తో జరుగుతున్న మ్యాచ్​లో బెంగళూరు 5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 62 పరుగులు చేసింది. వర్షం కారణంగా ఐదు ఓవర్లకే మ్యాచ్​ కుదించగా... తొలి ఓవర్లోనే 23 పరుగులు చేసింది కోహ్లీ - డివిలియర్స్ జోడి. ఆరు బంతుల్లో 25 పరుగులు చేశాడు విరాట్. మొదటి ఓవర్లో ధారాళంగా పరుగులిచ్చిన రాజస్థాన్​... రెండో ఓవర్ నుంచి ఆర్​సీబీ బ్యాట్స్​మెన్​ను కట్టడి చేసింది. రాజస్థాన్ బౌలర్లలో శ్రేయస్ గోపాల్​ 3 వికెట్లు తీయగా.. రియాన్, ఉనద్కత్, థామస్ తలో వికెట్ తీసుకున్నారు.

శ్రేయస్ హ్యాట్రిక్...

జోరు మీదున్న కోహ్లిని శ్రేయస్ గోపాల్​ ఔట్​ చేశాడు. అనంతరం డివిలియర్స్ (10), స్టోయినిస్​ను (0) పెవిలియన్​ చేర్చి హ్యాట్రిక్​ వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. ఈ సీజన్​లో పంజాబ్​ బౌలర్​ సామ్​ కరన్ తర్వాత హ్యాట్రిక్ తీసిన రెండో బౌలర్ శ్రేయస్ గోపాల్.

విరాట్ విజృంభణ..

బెంగళూరులో విరాట్ కోహ్లీ మినహా మిగతా బ్యాట్స్​మెన్ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. విరాట్​ తొలి ఓవర్ మొదటి​ రెండు బంతులని సిక్సర్లుగా మలిచాడు.

Last Updated : May 1, 2019, 12:15 AM IST

ABOUT THE AUTHOR

...view details